SSRajamouli : రాజమౌళి నన్ను టార్చర్ చేస్తున్నాడు.. చనిపోతున్నా

SSRajamouli :  రాజమౌళి నన్ను టార్చర్ చేస్తున్నాడు.. చనిపోతున్నా
X

ఇండియాస్ టాప్ డైరెక్టర్ రాజమౌళిపై అతన్ని బెస్ట్ ఫ్రెండ్ (అని అతనే చెప్పాడు) యు శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశాడు. అతని వల్ల తను చనిపోతున్నా అని చెబుతూ మరణ వాంగ్మూలం అంటూ ఒక వీడియో విడుదల చేశాడు. ఆ వీడియోలో అతను చెప్పిన మాటలు ఎలా ఉన్నాయంటే.. ‘ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అండ్ రమా రాజమౌళి వల్ల నేను చనిపోతున్నాను. అందుకు సంబంధించి ఇది నేను ఇస్తున్న మరణ వాంగ్మూలం. ఈడేంట్రా పబ్లిసిటీ స్టంటా అనుకోవద్దు. ఎందుకంటే పబ్లిసిటీ స్టంట్ చేసేవాడెడూ చనిపోడు.అందుకే ఈ మరణ వాంగ్మూలం ఇస్తున్నాను. నేను పనిచేసిన వారిలో కీరవాణి, గుణ్నం గంగరాజు, చంద్రశేఖర్ ఏలేటి, హను రాఘవపూడి, చెర్రీ ఇలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. వీళ్లందరికీ మా ఫ్రెండ్షిప్ గురించి తెలుసు.

1990ల నుంచి ఫ్రెండ్స్ మేం. రామాయణం, భారతం ఒక ఆడదాని వల్ల జరిగాయి అంటే ఏంటో అనుకున్నా. ఒకమ్మాయి వల్ల మేం ఇలా అవుతాం అని కలలో కూడా అనుకోలేదు. మా జీవితంలో ఒక అమ్మాయి ప్రవేశించింది. ముందు రాజమౌళి తర్వాత నేను. సేమ్ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ. అప్పుడు రాజమౌళి ఏం చేద్దాం అంటే నన్ను శాక్రిఫైజ్ చేయమన్నాడు. ముగ్గురం కలిసి ఉందాం అన్నాడు. అది ఛెండాలంగా ఉంటుందని చెప్పి. మరేంటీ అంటే కాలం అన్నిటికీ సమాధానం చెబుతుందన్నాడు. ఇదంతా శాంతినివాసం కంటే ముందు. చిన్న చిన్న గొడవలు ఇమెచ్యూరిటీ ఏంటీ అని నేను సైలెంట్ గా పనిచేసుకుంటున్నాను. ఇప్పుడు ఆడు నెంబర్ వన్ డైరెక్టర్ అయ్యాక.. ఇవన్నీ ఎవరికైనా చెబుతానేమో అని ఇప్పుడు నన్ను టార్చర్ పెడుతున్నాడు. ఎందుకు అంటే ఒకసారి మన స్టోరీని సినిమా చేస్తా అని నేను అన్నందుకు టార్చర్ మొదలుపెట్టాడు నా 30 సంవత్సరాల జీవితాన్ని ఆడికోసం శాక్రిఫైజ్ చేశాను. భైరవ, కార్తికేయ మా చేతుల్లో పెరిగారు. ఇప్పుడు వాళ్లెవరినీ నాతో మాట్లాడనీయడం లేదు.. నన్ను విపరీతంగా టార్చర్ పెడుతున్నాను. ఇది భరించలేక నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను’ అంటూ ఒక నాలుగు నిమిషాలకు పైగా ఉన్న వీడియో రిలీజ్ చేశాడు.

పైగా తన పేరు యూ శ్రీనివాసరావు అని యమదొంగ సినిమాలో ఎక్సిక్యూటివ్ ప్రొడ్యసర్ గా పేరు కూడా వేశాడని చెప్పాడు. ప్రస్తుతం రాజమౌళి టాప్ డైరెక్టర్ గా ఉన్నాడు. 30యేళ్ల క్రిందటి విషయాల గురించి ఇప్పుడు టార్చర్ పెడుతున్నాడు అనడంలో సహేతుకత స్పష్టంగా లేకున్నా.. దీనికి ఆ ఫ్యామిలీ రియాక్ట్ అయి క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం తేలదు.

Tags

Next Story