'భద్ర' ఆఫర్‌ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోస్ ఎవరో తెలుసా!!

భద్ర ఆఫర్‌ని రిజెక్ట్ చేసిన స్టార్ హీరోస్ ఎవరో తెలుసా!!
X
ఎవరితో తీసినా సినిమా హిట్టయితే దర్శక నిర్మాతలు ఏది జరిగినా అంత మన మంచికే అనుకుంటారు.

ఒక్కోసారి అవకాశాలు అలా చేజారిపోతుంటాయి. ఎవరితో తీసినా సినిమా హిట్టయితే దర్శక నిర్మాతలు ఏది జరిగినా అంత మన మంచికే అనుకుంటారు. అప్పుడే ఇండస్ట్రీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చారు బోయపాటి. రవితేజ, మీరా జాస్మిన్ జంటగా భద్రను తెరకెక్కించారు. ప్రేమ, ఫ్యాక్షన్, కామెడీ అన్ని అంశాలు మేళవించి రూపొందించిన భద్ర సూపర్ డూపర్ హిట్టయింది.



అయితే ఈ చిత్ర కధను రవితేజ కంటే ముందు ఇద్దరు హీరోలు రిజెక్ట్ చేశారట. తన కెరీర్‌ని స్టార్ హీరోలతో మొదలు పెట్టాలనుకుంటే వాళ్లిద్దరూ రిజెక్ట్ చేయడంతో కథను తీసుకుని రవితేజ దగ్గరకు వెళ్లారు. ఆయనకి కథ నచ్చడంతో వెంటనే చిత్రీకరణ మొదలు పెట్టడం, విడుదలయ్యాక సక్సెస్ అవడం జరిగాయి. మరి ఇంతకీ భద్రను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరోలు ఎవరంటే..



మొదట అల్లు అర్జున్‌తో చేద్దామని అల్లు అరవింద్‌ని కలిసి కధ చెప్పారు బోయపాటి. అప్పటికే ఆర్య చేస్తున్న బన్నీ.. సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమాలో నటించడం కుదరదని చెప్పారు. అయితే స్టోరీ బావుందని బన్నీ.. బోయపాటిని దిల్ రాజు దగ్గరకు తీసుకెళ్లడంతో వెంటనే ఆయన అడ్వాన్స్ కూడా ఇచ్చేసాడు. అయితే హీరో మాత్రం ఇంకా కన్ఫామ్ కాలేదు.

అక్కడి నుంచి ఎన్టీఆర్‌ను కలిసి భద్ర కథను వినిపించారు బోయపాటి. అప్పటికే సాంబ షూటింగ్‌తో బిజీగా ఉన్న ఎన్టీఆర్.. కొత్త డైరెక్టర్ ఎలా తీస్తాడో ఏమో అని అనుమానంతో తర్వాత చేద్దాం అని పంపించేశాడట.



ఇక ఆ కథ చివరికి రవితేజని చేరింది. ఆయనకు సూపర్ సక్సెస్‌ను తెచ్చి పెట్టింది.

Tags

Next Story