NTR Devara : ఇప్పటికీ దేవరనే హైలెట్

కొన్ని పాటలు చార్ట్ బస్టర్స్ గా ఉంటాయి. కానీ సినిమా వచ్చి వెళ్లిపోయిన తర్వాత మళ్లీ కనిపించవు. కొన్ని మాత్రమే ఆ సినిమా గురించి మర్చిపోయినా పాటలు మాత్రం నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. అందుకు కారణం ఆ సాంగ్స్ ను కొట్టే ఆల్బమ్ మరోటి రాకపోవడం. వచ్చినవి యూత్ కు కనెక్ట్ కాకపోవడం. ఇంతే. ఇలా చూస్తే దేవర పాటలు అప్పటి నుంచి ఇప్పటి వరకూ అదరగొడుతూనే ఉన్నాయి. అనిరుధ్ సంగీతం అందించిన దేవర పాటలు అన్ని వేడుకల్లోనూ సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా ‘జాతర’పాట. ప్రస్తుతం శివరాత్రి సందర్భంగా చాలా ఊళ్లల్లో జరుగుతున్న జాతర్లలో.. చిన్నవాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకూ దేవర జాతర పాట స్టెప్పులతో దుమ్మురేపుతున్నారు. ఇక చుట్టమల్లె పాటైతే అప్పుడెలాగైతే కాలేజ్ బస్ లలో సందడి చేసిందో. ఇప్పుడూ అంతే సందడి చేస్తోంది. రీసెంట్ గా కూడా నయనతార పిల్లలు ఆ పాటతో శ్రుతి కలుపుతూ.. ఆఁ అంటూ వంత పాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది.
దేవర తర్వాత ఆ రేంజ్ ఇంపాక్ట్ చూపించిన పాటలు మళ్లీ రాలేదనే చెప్పాలి. సంక్రాంతికి వస్తున్నాం పాటలు హిట్. కానీ ఇలా ఏదైనా వేడుకల సందర్భంగా పాడుకునేవి కావు. ఆ పాటలో డ్యాన్స్ కూడా లేకపోవడంతో పెద్దగా పట్టించుకోలేదు. ఇక గేమ్ ఛేంజర్ విషయంలోనూ అంతే. ఆ సినిమా ఉన్నంత వరకే సందడి కనిపించింది. తర్వాత నో సౌండ్.
విశేషం ఏంటంటే.. దేవర ఆల్బమ్ వచ్చినప్పుడు చాలామంది ఈ పాటలు యావరేజ్ అంటూ పెదవి విరిచారు. సినిమా చూసిన తర్వాత ఎక్కువగా అడిక్ట్ అయిపోయారు. మరి ఈ దేవర ఆల్బమ్ ఫీవర్ ఇంకెన్నాళ్లు ఉంటుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com