Chhaava : ఛావాకు ఏపిలో నిరసన సెగ

గత నెల 14న విడుదలై దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ఛావాను ఈ శుక్రవారం తెలుగులో విడుదల చేస్తున్నారు. హిందీ రాని వాళ్లు చాలామంది ఈ చిత్రాన్ని తెలుగులో చూడాలని బలంగా కోరుకున్నారు. వారి కోసం గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని తెలుగులో డబ్ చేసి విడుదల చేస్తున్నారు. ఇక్కడా మంచి బుకింగ్స్ ఉన్నాయి. తెలుగులోనూ పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు ఇక్కడ డబ్ చేసిన వారు. అయితే తాజాగా ఈ మూవీని ఇక్కడ విడుదల చేయొద్దు అంటూ ఆంధ్రప్రదేశ్ లో నిరసనలు మొదలుపెట్టారు.
ఛావా కథను పూర్తిగా వక్రీకరించి రూపొందించారని.. ఏపీ లో సినిమా రిలీజ్ చేయకుండా చూడాలని ముస్లిం ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ మహ్మద్ జియా ఉల్ హాక్ డిమాండ్ చేస్తున్నాడు. ఈ మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం కూడా ఇచ్చారు. సినిమా రిలీజ్ అయితే అడ్డుకుంటాం అని హెచ్చరిస్తున్నారు వాళ్లు. దీంతో ఏపిలో ఛావా రిలీజ్ పై ఒక సస్పెన్స్ అయితే ఉందని చెప్పాలి. బట్ రిలీజ్ ను ఆపడం మాత్రం అంత సులువేం కాదు.కాకపోతే అక్కడక్కడా కొన్ని థియేటర్స్ లో ఆ సంఘాల వాళ్లు నిరసన వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఆ మేరకు భద్రత విషయాలు చూసుకుంటే సరిపోతుందేమో.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com