Stree 2 : అక్షయ్, అజయ్ వల్ల కానిది స్త్రీ వల్ల అయింది

Stree 2 :  అక్షయ్, అజయ్ వల్ల కానిది స్త్రీ వల్ల అయింది
X

బాలీవుడ్ ఈ యేడాది విజయాలు లేక పూర్తిగా డీలా పడిపోయింది. అప్పుడప్పుడూ చిన్న సినిమాల మెరుపులే తప్ప.. ఒక్క సాలిడ్ బ్లాక్ బస్టర్ పడలేదు. అక్కడ టాప్ స్టార్స్ గా చెప్పుకునే అక్షయ్ కుమార్, అజయ్ దేవ్ గణ్ సినిమాలకైతే మినిమం ఓపెనింగ్స్ కూడా రాలేదు. ఓ రకంగా బాలీవుడ్ ఇప్పట్లో హిట్ చూడ్డం కష్టమే అని అంతా ఫిక్స్ అయిన టైమ్ లో స్త్రీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోందిప్పుడు. ఈ మూవీ విజయం ఊహించిందే అయినా.. మరీ ఫస్ట్ డే నే రికార్డ్స్ స్థాయి కలెక్షన్స్ సాధించి సత్తా చాటడంతో అక్షయ్, అజయ్ ల వల్ల కానిది స్త్రీ సాధించిందంటూ అక్కడి క్రిటిక్స్ ఈ మూవీని ఆకాశానికెత్తుతున్నారు.

ఖచ్చితంగా చెబితే బాలీవుడ్ టాప్ స్టార్ షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ తర్వాత ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ ఈ స్త్రీ 2 మూవీదే. అది ఈ మూవీ రేంజ్.

స్త్రీ అనే సినిమా 2018 ఆగస్ట్ 31న విడుదలైంది అమర్ కౌశిక్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని ద ఫ్యామిలీ మేన్ డైరెక్షన్ డ్యూయొ రాజ్ - డికే తో పాటు దినేష్ విజయన్ నిర్మించారు. రాజ్ కుమార్ రావు, శ్రద్ధా కపూర్ జంటగా నటించారు. అప్పట్లో సెన్సేషనల్ హిట్ గా నిలిచిందీ మూవీ. చాలాయేళ్ల క్రితం తెలుగు, కన్నడ రాష్ట్రాల్లో గోడలపై ఓ స్త్రీ రేపు రా అనే రాతలు కనిపించేవి. వాటి ఆధారంగానే ఈ మూవీ రూపొందింది. 180 కోట్లు కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది స్త్రీ. అప్పటి నుంచి ఈ చిత్రానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే స్త్రీ కి సీక్వెల్ అనౌన్స్ అయినప్పుడే మంచి క్రేజ్ వచ్చింది. అది ఏ రేంజ్ లో ఉందో ఈ ఓపెనింగ్స్ ప్రూవ్ చేశాయి.

స్త్రీ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ 55.40 కోట్లు. బాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో ఉన్న మూవీ జవాన్ కు ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ 65. 50 కోట్లు. విశేషం ఏంటంటే.. స్త్రీ 2 కి ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ వేస్తే 9. 40 కోట్లు వచ్చాయి. ఈ మొత్తం కలిపితే 64.80 కోట్లు అవుతుంది. సో.. జవాన్ కు స్త్రీ 2కి మధ్య ఫస్ట్ డే కలెక్షన్స్ కు మధ్య పెద్ద తేడాలేం లేవు. ఇప్పుడీ కలెక్షన్స్ గొడవ ఎందుకు అంటే పాపం చాలాకాలంగా హిట్టే లేక కునారిల్లుతున్న బాలీవుడ్ కు స్త్రీ 2 రూపంలో సాలిడ్ బ్లాక్ బస్టర్ పడింది.

ఈ క్రెడిట్ అంతా శ్రద్ధా కపూర్ కే ఎక్కువగా ఇస్తోంది బాలీవుడ్ మీడియా. అఫ్ కోర్స్ రాజ్ కుమార్ రావు నటనను ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రానికీ అమర్ కౌశిక్ దర్శకుడు. మొత్తంగా సీక్వెల్ తో బాలీవుడ్ కు బ్లాక్ బస్టర్ అందించాడీ దర్శకుడు. అయితే స్త్రీ 2 పాటు ఖేల్ ఖేల్ మే, వేదా అనే సినిమాలు విడుదలయ్యాయి. అలా కాకుండా స్త్రీ 2 కి సోలో రిలీజ్ దక్కి ఉంటే ఖచ్చితంగా ఆల్ టైమ్ రికార్డ్ కొట్టేదేమో. మరి ఓవరాల్ గా ఈ హారర్ కామెడీ మూవీ ఎన్ని కోట్లు వసూళ్లు చేస్తుందో చూడాలి.

Tags

Next Story