Shraddha Kapoor : కల్కి ఫుల్ టైమ్ రికార్డ్ బద్ధలు కొట్టబోతున్న స్త్రీ

కంటెంట్ బావుంటే, కాలం కలిసొస్తే కాసులు రికార్డులు బద్ధలు కొట్టేలా రాల్తాయంటారు. ఎన్నాళ్లుగానో సరైన హిట్ లేక తంటాలు పడుతోంది బాలీవుడ్. టాప్ హీరోలు, స్టార్ హీరోలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నారు. అలాంటి టైమ్ లో వచ్చిన మన కల్కి అక్కడి బాక్సాఫీస్ కు కాస్త ఊపిరిపోసింది. ఈ మూవీపై మొదట కొంత నెగెటివ్ చేయాలని చూసినా.. ఫైనల్ గా ఆడియన్స్ కు నచ్చింది. అందుకే కల్కి 2898ఏడి అక్కడ ఫుల్ రన్ లో ఏకంగా 290 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ రికార్డ్ ను ఇప్పుడు స్త్రీ 2 మూవీ కొల్లగొట్టబోతోంది.నిజానికి హిందీ వరకూ కల్కి అడ్వాన్స్ బుకింగ్ రికార్డ్స్ ను ఆల్రెడీ స్త్రీ 2 కొల్లగొట్టేసింది.
బాలీవుడ్ కు కల్కి విజయం కంటే స్త్రీ 2 విజయం కీలకం అయిందిప్పుడు. మొదటి రోజే ఏకంగా 65 కోట్లు కొల్లగొట్టి హారర్ కంటెంట్ కు శ్రద్ధా కపూర్ కెపాసిటీకి ఉన్న పవర్ ఏంటో చూపించింది. ఆమెతో పాటు రాజ్ కుమార్ రావు కూడా మూవీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫస్ట్ పార్ట్ కు మించిన విజయం సాధిస్తోంది స్త్రీ. వీకెండ్ లో 200 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ సోమవారం కూడా 40 కోట్ల వసూళ్లు సాధించి ట్రేడ్ ను ఆశ్చర్య పరిచింది. మంగళ, బుధవారాలతో కల్కి ఫుల్ రన్ లో సాధించిన మొత్తంను సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే కల్కిని దాటింది అని కాదు కానీ.. ఓ లేడీ ప్రధాన పాత్రలో నటించిన సినిమా.. ఈ రికార్డ్ ను ఛేదించడం ఖచ్చితంగా పెద్ద విషయమే. ఇందులో అక్షయ్ కమార్, అజయ్ దేవ్ గణ్ వంటి వారికి సాధ్యం కాని అంశం కాబట్టే స్త్రీ శక్తి గొప్పది అంటున్నారు. ఏదేమైనా బాలీవుడ్ కు స్త్రీ 2 విజయం గొప్ప బూస్ట్ ఇచ్చింది. కాకపోతే దాన్ని కంటిన్యూ చేసే మూవీ ఏంటా అంటే అంచనాలకూ అందడం లేదు అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com