Student No 1: ఆ రెండు రోజులు ఎన్టీఆర్‌ని చూసి తలపట్టుకున్న రాజమౌళి!

Student No 1: ఆ రెండు రోజులు ఎన్టీఆర్‌ని చూసి తలపట్టుకున్న రాజమౌళి!
Student No 1: కొన్ని సినిమాలను ఎన్ని సంవత్సరాలైనా ప్రేక్షకులు మర్చిపోకుండా తెరకెక్కిస్తారు మేకర్స్.

Student No 1: కొన్ని సినిమాలను ఎన్ని సంవత్సరాలైనా ప్రేక్షకులు మర్చిపోకుండా తెరకెక్కిస్తారు మేకర్స్. అలాంటి సినిమాలు ఈకాలంలో అరుదుగా వస్తున్నాయి. అందుకే ఒకప్పటి సినిమాలనే మళ్లీ మళ్లీ చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు మూవీ లవర్స్. అలాంటి వాటిలో ఒకటే యంగ్ టైగర్ ఎన్‌టీఆర్(NTR) నటించిన స్టూడెంట్ నెం.1(Student No 1). ఆ సినిమా వచ్చి ఇప్పటికే 20 ఏళ్లు అయ్యిందంటే నమ్మలేం. ఎందుకంటే ఎన్నిసార్లు చూసినా స్టూడెంట్ నెం.1 అదే ఫ్రెష్ ఫీల్ ఇస్తుంది. నిన్ను చూడాలని చిత్రంతో నందమూరి వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్‌టీఆర్‌ను హీరోగా నిలబెట్టింది స్టూడెంట్ నెం.1.

ఇక దర్శకుడిగా రాజమౌళి(Rajamouli)కి ఇది మొదటి చిత్రమే అయినా దీనితోనే ఆయన సరిపడా క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. ఒకపక్క కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ఫుల్ లవ్‌ స్టోరీని నడిపిస్తూనే.. మరోపక్క ఎన్‌టీఆర్ నుండి నందమూరి ఫ్యాన్స్ కోరుకునే మాస్ ఎలిమెంట్స్‌ను కూడా ఇందులో మిక్స్ చేసాడు రాజమౌళి. అందుకే తారక్, రాజమౌళి కాంబినేషన్‌కు ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు. కానీ రాజమౌళికి ఎన్‌టీఆర్ మీద ఏర్పడిన ఫస్ట్ ఇంప్రెషన్ పాజిటివ్‌ది కాదట. ఈ విషయం రాజమౌళినే స్వయంగా వెల్లడించాడు.

నిన్ను చూడాలని సినిమా పూర్తి చేసుకున్న ఎన్‌టీఆర్ తన తరువాతి సినిమాల కోసం కథలు వినడం మొదలుపెట్టాడు. రాజమౌళి కూడా దర్శకుడిగా డెబ్యూ చేయడానికి కథ పట్టుకొని హీరో కోసం వెతుకున్నాడు. అదే సమయంలో ఒక స్టార్ డైరెక్టర్ సలహా వల్ల ఎన్‌టీఆర్‌ను హీరోగా ఎంచుకున్నాడు రాజమౌళి. తారక్‌ను చూడగానే తన హీరో అలా ఉంటాడని ఊహించుకోని రాజమౌళి రెండు రోజులు డిసప్పాయింట్‌గానే ఉన్నాడట. కానీ ఒక్కసారిగా తెరమీద తారక్ నటనను చూసేసరికి రాజమౌళి తనకు ఫ్యాన్ అయిపోయాడు. స్టూడెంట్ నెం.1 తర్వాత కూడా వీరు కలిసి చేసిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మరోసారి ఆర్ ఆర్ ఆర్‌తో ప్యాన్ ఇండియా రికార్డు కొట్టడానికి సిద్ధమవుతోంది ఈ కాంబినేషన్.

Tags

Read MoreRead Less
Next Story