Mahadev Betting App : 'స్టైల్' యాక్టర్ పై కేసు నమోదు

Mahadev Betting App : స్టైల్ యాక్టర్ పై కేసు నమోదు
X
మహాదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో స్టైల్ యాక్టర్ సాహిల్ ఖాన్‌పై కేసు బుక్ చేసిన ముంబై పోలీసులు

రాజకీయంగా వివాదాస్పదమైన మహాదేవ్ బెట్టింగ్ యాప్‌లో దర్యాప్తును కొనసాగిస్తూ, ముంబై పోలీసులు గత వారం బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్‌తో సహా కనీసం 31 మందిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు నవంబర్ 13న తెలిపారు. ముంబై పోలీసుల ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌లో పేర్కొన్న 31 మంది నిందితులతో పాటు, ఇంకా చాలా మంది తెలియని వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తోంది. వారి జాడ కోసం దర్యాప్తు కొనసాగుతోంది.

ఈ కేసులో పేరున్న వారిలో నటుడు సాహిల్ ఖాన్ నంబర్ 26, మహదేవ్ యాప్‌ను ప్రమోట్ చేయడం, ప్రచారం చేయడంతో పాటు దాని నుండి భారీ లాభాలను ఆర్జించడం కోసం ఆపరేట్ చేశాడని ఆరోపించినలు వినిపిస్తున్నాయి. బెట్టింగ్ యాప్ ద్వారా ప్రజలను రూ. 15,000 కోట్లకు పైగా మోసం చేశారంటూ ముంబైకి చెందిన ప్రకాష్ బంకర్ అనే సామాజిక కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు ఈ పరిణామం చోటు చేసుకుంది.

భారతీయ శిక్షాస్మృతి, గ్యాంబ్లింగ్ యాక్ట్, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్లను ప్రయోగిస్తూ మాతుంగా పోలీసులు ఫిర్యాదు చేశారు. తదుపరి విచారణ కొనసాగుతోంది. "స్టైల్", "ఎక్స్‌క్యూస్ మీ", "అల్లాదిన్" వంటి చిత్రాలలో నటించిన సాహిల్ ఖాన్, ఫిట్‌నెస్ మాస్టర్, యూట్యూబర్, ఇతరులు యాప్‌ను ప్రమోట్ చేయడానికి, ఎక్కువ మందిని ఉపయోగించమని ఆకర్షించడానికి సెలెబ్ పార్టీలను నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేత ఏకకాలంలో విచారణ కొనసాగిస్తోంది. ఇటీవలి కాలంలో అనేక బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్‌లపై వివిధ ఏజెన్సీల అణిచివేత తర్వాత అనేక మంది బాలీవుడ్ నటీనటులు రాడార్‌లో ఉన్నారు. గత కొన్ని వారాలుగా యాప్ ప్రమోటర్లలో కొంతమందిని అరెస్టు చేశారు.




Tags

Next Story