Allu Arjun : సంజయ్ లీలా బన్సాలీతో అల్లు అర్జున్.. !

Allu Arjun : గత ఏడాది డిసెంబర్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ రిలీజై సూపర్ హిట్ కొట్టింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ పైన ఫోకస్ పెట్టారు బన్నీ... ఈ ఏడాది చివర్లో పుష్ప ది రూల్‌ని రిలీజ్ చేయనున్నారు. పుష్ప చిత్రం తర్వాత స్టైలిష్ స్టార్ టాప్ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా బన్సాలీతో కలిసి ఓ సినిమా చేయనున్నట్లుగా తెలుస్తోంది.
ముంబైలోని సంజయ్ లీలా బన్సాలీ ఆఫీస్‌కి వెళ్ళాడు బన్నీ.. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. త్వరలోనే వీరిద్దరూ కలిసి సినిమా చేయబోతున్నారని అందరూ అనుకుంటున్నారు. గ్రాండియర్‌గా సినిమాలను తెరకెక్కించడంలో సంజయ్ లీలా భన్సాలీకి ఓ ప్రత్యేకత ఉంది. అందుకే తన తదుపరి సినిమాకి ఆయనని దర్శకుడిగా బన్నీ ఎంచుకున్నారని సమాచారం.
మరోవైపు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'గంగూబాయి కతియావాడి' ఇటీవలే రిలిజై ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో అలియా భట్ మెయిన్ లీడ్ రోల్ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com