Samantha : బాక్సాఫీస్ కు కళ తెచ్చిన చిన్న సినిమాలు

Samantha :  బాక్సాఫీస్ కు కళ తెచ్చిన చిన్న సినిమాలు
X

చాలా రోజుల తర్వాత ఒక వారం విడుదలైన రెండు సినిమాలు బాక్సాఫీస్ కు కళ తెచ్చాయి. సమంత నిర్మించిన ఫస్ట్ మూవీ శుభంతో పాటు శ్రీ విష్ణు నటించిన సింగిల్ మూవీస్ రెండూ పాజిటివ్ టాక్ తో పాటు పాజిటివ్ రివ్యూస్ అందుకున్నాయి. అటు మౌత్ టాక్ కూడా బావుంది. దీంతో ఈ రెండు సినిమాలూ కమర్షియల్ గా విజయవంతం అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి. దీంతో హిట్ 3 తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి కనిపిస్తోంది.

శుభం మూవీ హారర్ కామెడీ. అలాగని భయంకరమైన హారర్, పొట్టచెక్కలయ్యేంత కామెడీ కనిపించదు. అయినా చూస్తున్నంత సేపూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఈ కారణంగానే మూవీకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఒకవేళ రెండూ హారర్, కామెడీ స్ట్రాంగ్ గా ఉండి ఉంటే ఇంతకు ముందు వచ్చిన చిత్రాలతో పోలికలు ఉండేవి. అది కొంత ఇబ్బంది పెట్టేదేమో.

ఇక సింగిల్ మూవీ టైటిల్ కు తగ్గట్టుగా సింగిల్ లైనర్స్ తో అదరగొట్టారు. శ్రీ విష్ణు టైమింగ్ తో పాటు హీరోయిన్ల గ్లామర్ కూడా ఈ చిత్రానికి ప్లస్ అయింది. పెద్ద కథంటూ లేకపోయినా కామెడీ బాగా వర్కవుట్అయింది. వెన్నెల కిశోర్ మరోసారి మెరిశాడు. దీంతో సింగిల్ మూవీ థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి.

విశేషం ఏంటంటే.. ఈ రెండు సినిమాలకు ఓవర్శీస్ లో కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇదో శుభ పరిణామం అనే చెప్పాలి.

Tags

Next Story