Subrahmanyaa Movie : ఈ విలన్ లో మంచి దర్శకుడు ఉన్నాడే

హీరోలు అప్పుడప్పుడూ మెగా ఫోన్స్ పట్టడం ఎప్పుడూ చూస్తున్నాం. విలన్స్ కూడా కొన్ని ప్రయత్నాలు చేసిస సందర్భాలున్నాయి. బట్ ఈ మధ్య కాలంలో అలా ఎవరూ లేరు అనే చెప్పాలి. కాస్త లేట్ అయినా నేనున్నా అంటూ వస్తున్నాడు రవి శంకర్. సాయి కుమార్ తమ్ముడు నుంచి ఇప్పుడు కన్నడ నాట టాప్ విలన్ అనే స్థాయికి చేరుకున్నాడు. డబ్బింగ్ విభాగంలో అనేక ప్రయోగాలు చేసి ఎన్నో అవార్డులూ అందుకున్నాడు రవి శంకర్. చాలా టాలెంటెడ్ అయినా ఎందుకో తెలుగు సినిమా పరిశ్రమ రవి శంకర్ ను పెద్దగా వాడుకోలేదు. అలాగే అతను ఎన్నో హోప్స్ పెట్టుకున్న కొన్ని సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద పోయాయి.
ఎప్పుడో 20 యేళ్ల క్రితమే రవిశంకర్ ఓ కన్నడ సినిమాను డైరెక్ట్ చేశాడు. తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టలేదు. ఇన్నేళ్ల తర్వాత తన కొడుకును అద్వయ్ ని హీరోగా పరిచయం చేస్తూ దర్శకుడుగా మారాడు. అద్వయ్ సరసన రుబల్ షెకావత్ హీరోయిన్ గా నటించిస్తోంది. సుబ్రహ్మణ్యా అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ మూవీ గ్లింప్స్ ను విడుదల చేశారు. ఈ గ్లింప్స్ చూస్తే రవి శంకర్ ఇప్పటి ట్రెండ్ ను బాగా పట్టుకున్నాడు అనిపిస్తుంది. అలాగే తనయుడి లాంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉండబోతోందని అర్థం అవుతుంది.
ఒకానొక అడవిలో ఓ పెద్ద బావి లాంటి లోతైన స్థలంలో ఒక నిధి లేదా నిధి రహస్యాలున్న పుస్తకం ఒక పేటికలో ఉంటుంది. ఆపేటికను కాపాడుతూ వందల పాములు కాపలా కాస్తుంటాయి. అలాంటి ప్రమాదకరమైన చోటుకు వెళ్లిన హీరో ఆ పాములు దాటుకుని ఆ పేటికను దొంగలిస్తాడు. పాములన్నీ వెంట పడతాయి. ఇతను పరుగు పెడుతూ ఆ అడవిలో కొండ చివరికి వస్తాడు. చాలా పెద్ద లోయ ఉంటుంది. ఆ కొండ ఆవల మరో కొండ.. అక్కడ ఓ గుడి ఉంటుంది. ఇటు చూస్తే ఇతను వెళ్లలేదు. ఎదురుగా చూస్తే పాములన్నీ అతన్ని రౌండప్ చేస్తాయి.. వెనక గుడికి ఆనుకుని శ్రీ రాముడు కనిపిస్తాడు.. గ్రాఫిక్స్ లో. ఇదీ సుబ్రహ్మణ్యా గ్లింప్స్.
విజువల్స్ బావున్నాయి. కంటెంట్ పాతగానే ఉన్న ఈ కాలపు మేకింగ్ తో వస్తున్నారి తెలుస్తోంది. మొత్తంగా రవి శంకర్ ఈ ట్రెండ్ కు తగ్గ కథ, కథనాలతో కొడుకును స్ట్రాంగ్ గా లాంచ్ చేయబోతున్నాడని.. అలాగే అతన్లో ఓ మంచి దర్శకుడు కూడా ఉన్నాడని ఈ గ్లింప్స్ ను చెప్పేయొచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com