Varisu: రంజితమే పాటకు కడుపులో బిడ్డకు ఊపు: ఆనందంలో తమన్

Varisu: రంజితమే పాటకు కడుపులో బిడ్డకు ఊపు: ఆనందంలో తమన్
Varisu:ఎన్ని అవార్డులు తీసుకుంటే మాత్రం ఇంత ఆనందం వస్తుందా.. అమ్మ కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఊపొచ్చిందంటే అంతకంటే ఆనందించ వలసిన విషయం ఏం ఉంటుంది.

Varisu: ఎన్ని అవార్డులు తీసుకుంటే మాత్రం ఇంత ఆనందం వస్తుందా.. అమ్మ కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఊపొచ్చిందంటే అంతకంటే ఆనందించ వలసిన విషయం ఏం ఉంటుంది. ఈ ఆనంద క్షణాలను ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్.



పాటకు పరవశించని హృదయం ఉంటుంది.. ఆఖరికి పశువులు కూడా తలాడిస్తాయి.. సంగీతం వింటే పాలు కూడా ఎక్కువ ఇస్తున్నాయన్న వార్తలు కూడా చూస్తున్నాం ఈ మధ్య. మరి పొట్టలో ఉన్న పాపాయి కూడా పాట నచ్చేసిన విషయం అమ్మతో ఎలా చెప్తుంది.. అందుకే లోపల గంతులు వేస్తూ తన్మయత్వం చెందుతోంది. ఈ అపురూప దృశ్యాన్ని అమ్మ అభిమానులతో షేర్ చేసుకుంది.



వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన వారిసు చిత్రం ఈ రోజు సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. చిత్రంలోని రంజితమే పాట ఇప్పటికే యూట్యూబ్‌ను షేక్ చేసింది. తాజాగా తమిళనాడుకు చెందిన ఓ ఫ్యామిలీ స్పెషల్ వీడియో షేర్ చేసింది. ఇందులో ఓ మహిళ బేబీ బంప్‌తో రేపో మాపో డెలివరీ అయ్యేలా ఉంది. అయితే పొట్టలో ఉన్న బిడ్డ రంజితమే పాట వింటూ లోపల డ్యాన్స్ చేస్తున్నట్లున్నాడని ఆనందంతో చెబుతోంది.



పాట పెట్టిన ప్రతిసారీ లోపల బేబీ ఇలాగే డ్యాన్స్ చేస్తోందని తల్లి మురిసిపోతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూసిన సంగీత దర్శకుడు తమన్ ఆనందానికి అవధుల్లేవు. ఈ వీడియో చూస్తుంటే మధురానుభూతికి లోనవుతున్నారు. నా రోజును ఇది ఎంతో సంతోషంగా మార్చేసింది అని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story