Rashmika Mandanna : కుబేర టీమ్ నుంచి సడెన్ సర్ ప్రైజ్

Rashmika Mandanna :  కుబేర టీమ్ నుంచి సడెన్ సర్ ప్రైజ్
X

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపొందుతోన్న సినిమా కుబేర. ధనుష్, రష్మిక మందన్నా జంటగా నాగార్జున కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏసియన్ సినిమాస్, శ్రీ వెకంటేశ్వర క్రియేషన్స్ ఎల్ఎల్పీ, అమిగోస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఇది. ధనుష్ తో శేఖర్ కమ్ముల అన్నప్పుడే ఈ కాంబినేష్ కు ఓ హైప్ వచ్చింది. తర్వాత రష్మిక, నాగ్ కూడా ప్రాజెక్ట్ లోకి రావడంతో ఓ రేంజ్ లో క్రేజ్ క్రియేట్ అయింది. బట్ దాన్ని నిలబెట్టుకోవడంలో మూవీ టీమ్ ఫెయిల్ అయిందనే చెప్పాలి. కొన్నాళ్లుగా అసలు ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకునేవాళ్లే కనిపించడం లేదు. రిలీజ్ గురించి కానీ, టీజర్ అప్డేట్స్ కానీ.. పాటల గురించి కానీ .. ఇలా దేన్నీ పట్టించుకోవడం లేదు. అందుకు ప్రధాన కారణం ధనుష్ కు ఇక్కడ ఫ్యాన్ బేస్ లేకపోవడం. నాగార్జున మెయిన్ హీరో కాకపోవడం.

మరోవైపు ఇతర సినిమాల గురించి బాగా ఆరా తీస్తున్నారు జనం. బట్ కుబేరను ఎవరూ పట్టించుకోవడం లేదు. అందుకే డిసెంబర్ లో విడుదలవుతుందనుకున్నా.. ఇప్పటి వరకూ ఎలాంటి ఊసూ లేదు. ఈ టైమ్ లో టీమ్ నుంచి సడెన్ గా టీజర్ అప్డేట్ రావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.


ఈ నెల 15న కుబేర టీజర్ ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.

ఈ అనౌన్స్ మెంట్ కోసం విడుదల చేసిన పోస్టర్ లో ఎప్పట్లానే ధనుష్ నిరుపేద లుక్ తో, నాగ్ టీ షర్ట్ తో, రష్మిక బ్యాగ్ తో ఎక్కడికో ప్రయాణం చేస్తున్నట్టు ఉండగా.. కింద కొందరు చిన్న పిల్లలు ఆడుకుంటున్నారు. టైటిల్ లో మంటలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ టీజర్ లో కనిపిస్తాయని చెప్పకనే చెప్పినట్టుగా ఈ పోస్టర్ లో ఉంది. మొత్తంగా టీజర్ వస్తే అయినా కుబేరకు కొంత హైప్ వస్తుందేమో చూడాలి.

Tags

Next Story