Sudeep: బాలీవుడ్ వర్సెస్ శాండల్‌వుడ్.. ఇద్దరు హీరోల మధ్య ట్వీట్ వార్..

Sudeep: బాలీవుడ్ వర్సెస్ శాండల్‌వుడ్.. ఇద్దరు హీరోల మధ్య ట్వీట్ వార్..
Sudeep: 'అజయ్ దేవగన్ సర్. నేను ఆ మాట చెప్పిన విధానానికి, మీకు అర్థమైన విధానానికి చాలా తేడా ఉంది అని నేను అనుకుంటున్నాను'

Sudeep: ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో శాండిల్‌వుడ్‌కు పెద్దగా ప్రాముఖ్యత ఉండేది కాదు.. కానీ 'కేజీఎఫ్' అనే సినిమా వచ్చిన తర్వాత శాండిల్‌వుడ్ ఫేటే మారిపోయింది. ఇప్పుడు ఏ ఇండస్ట్రీ వారు అయినా శాండిల్‌వుడ్‌ను తిరిగి చూస్తున్నాడు. అందుకే కన్నడ హీరో సుదీప్ బాలీవుడ్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. దానికి ఓ బాలీవుడ్ హీరో స్పందించాడు. దానికి సుదీప్ కూడా కౌంటర్ ఇచ్చాడు. ఇలా ప్రస్తుతం వీరిద్దరి మధ్య ట్వీట్ వార్ నడుస్తోంది.

కేజీఎఫ్ 2 విడుదలయ్యి దేశవ్యాప్తంగా మంచి టాక్‌తో కలెక్షన్లు కూడా రాబడుతోంది. అందుకే సుదీప్ ఇంక హిందీ మన నేషనల్ లాంగ్వేజ్ కాదు అంటూ వ్యాఖ్యలు చేశాడు. దీనికి బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ట్విటర్ ద్వారా స్పందించాడు. సుదీప్‌ను ట్యాగ్ చేస్తూ 'నీ దృష్టిలో హిందీ నేషనల్ లాంగ్వేజ్ కాకపోతే మీ మాతృభాష సినిమాలను హిందీలో ఎందుకు డబ్ చేసి విడుదల చేస్తున్నారు. హిందీ ఇప్పటికీ ఎప్పటికీ మన నేషనల్ లాంగ్వేజ్' అని ట్వీట్ చేశాడు అజయ్.

దానికి సుదీప్ రిప్లై ఇచ్చాడు. 'హలో అజయ్ దేవగన్ సర్. నేను ఆ మాట చెప్పిన విధానానికి, మీకు అర్థమైన విధానానికి చాలా తేడా ఉంది అని నేను అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని నేరుగా కలిసినప్పుడు ఆ మాట ఎందుకు అన్నానో చెప్తాను. అది ఎవ్వరినీ బాధపెట్టాలని లేదా గొడవ మొదలుపెట్టాలని కాదు. నేను ఎందుకు అలా చేస్తాను సర్' అన్నాడు సుదీప్. దీంతో పాటు తన ఈ అంశంపై మరికొన్ని ట్వీట్లు కూడా చేశాడు.

'నేను మన దేశంలోని ప్రతీ భాషను గౌరవిస్తాను, ప్రేమిస్తాను. నేను ఈ టాపిక్ ఇక్కడికే ఆగిపోతే బాగుంటుంది అనుకుంటున్నాను. నేను ఆ లైన్‌ను వేరే ఉద్దేశ్యంతో చెప్పాను. మిమ్మల్ని త్వరలో కలవాలని కోరుకుంటున్నాను.' అని ట్వీట్ చేశాడు సుదీప్.

ఇక చివరిగా 'మీరు హిందీలో చెప్పిందంతా నాకు అర్థమయ్యింది. ఎందుకంటే మేమందరం హిందీని ఇష్టపడ్డం, గౌరవించాం, నేర్చుకున్నాం. నేను కూదా నా రిప్లైను కన్నడలో ఇచ్చి ఉంటే ఎలా ఉండేది. మనందం భారతీయులమే కదా' అని తన ట్వీట్స్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాడు సుదీప్.

Tags

Read MoreRead Less
Next Story