Sudheer Babu : జటాధరుడుగా సుధీర్

కెరీర్ లో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా సరైన బ్లాక్ బస్టర్ కోసం ఇంకా వెయిటింగ్ లోనే ఉన్నాడు సుధీర్ బాబు. చివరగా వచ్చిన హరోంహర అతని వెయిటింగ్ కు ఎండ్ కార్డ్ వేస్తుందనుకున్నారు. ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఎప్పుడూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడుతున్న సుధీర్ కు మూడు నాలుగు విజయాలు మాత్రమే ఉన్నాయి. బట్ ఇవేవీ అతని రేంజ్ ను మార్చలేదు. ఇమేజ్ ను పెంచలేదు. దాని కోసమే ప్రయత్నాలు చేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం బాలీవుడ్ లో బాగీ అనే మూవీ లో విలన్ గానూ మెప్పించాడు. అందుకోసం ఏకంగా ఎయిట్ ప్యాక్ కండలు కూడా పెంచాడు. మంచి ఫిజిక్ ను మెయిన్టేన్ చేస్తూ సరికొత్త కథలతో ప్రయత్నాలు చేస్తోన్న సుధీర్ ఈ సారి జటాధరగా వస్తున్నాడు.
హరోంహర నుంచి నవ దళపతి అనే కొత్త బిరుదును కూడా యాడ్ చేసుకున్నాడు సుధీర్. ఆ ట్యాగ్ ను మ్యాచ్ చేస్తుందా అనుకుంటే హరోంహర చేయలేదు. అందుకే ఇప్పుడు మంచి సెంటిమెంట్ తో ఉన్న కంటెంట్ తో వస్తున్నట్టున్నాడు. జటాధర అనే టైటిల్ తో పాటు విడుదల చేసిన పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. షర్ట్ లేకుండా సిక్స్ ప్యాక్ తో నించుని త్రిశూలం చేత పట్టుకుని ఉన్నాడు సుధీర్. చుట్టూ.. డీమోన్స్ లాంటి ఆకారాలు కనిపిస్తున్నాయి. బ్యాక్ గ్రౌండ్ లో భారీ మహా శివుడి విగ్రహం ఉంది. ఇదైతే ఆకట్టుకునేలానే ఉంది. టైటిల్ అర్థం కూడా శివుడు అనే కాబట్టి సింబాలిక్ గా కూడా ఉంది.
వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేయబోతోన్న ఈ చిత్రాన్ని శివిన్ నారంగ్, ప్రేర్ణ అరోరా నిర్మిస్తున్నాడు. సుధీర్ బాబు సమర్పకుడుగా వ్యవహరిస్తున్నాడు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కాబోతోన్న ఈ జటాధరను 2025 మహా శివరాత్రికి విడుదల చేస్తాం అని ఇప్పుడే ప్రకటించడం విశేషం. పైగా తెలుగుతో పాటు హిందీలోనూ విడుదల చేస్తున్నాం అని చెప్పారు. మరి ఈ జటాధరుడైన సుధీర్ బాబు కోరుకుంటోన్న విజయాన్ని ఇస్తాడో లేదో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com