Sudigaali Sudheer : సుధీర్‌కు ఎంగేజ్‌మెంట్‌.. పక్కన ఎవరా అమ్మాయి?

Sudigaali Sudheer : సుధీర్‌కు ఎంగేజ్‌మెంట్‌.. పక్కన ఎవరా అమ్మాయి?
Sudigaali Sudheer: వెండితెర పై కమెడియన్‌‌గా కనబడుతూనే హీరోగా కూడా అప్పుడప్పుడు మెరుస్తున్నాడు. అయితే సుధీర్ పెళ్లి గురించి గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.

Sudigaali Sudheer: సుడిగాలి సుధీర్‌ అంటే తెలియని బుల్లితెర ప్రేక్షకులు బహుశా ఉండరేమో.. జబర్దస్త్ షోతో ఫుల్ పాపులర్ అయిన సుధీర్.. 'ఢీ'షోతో ఆ క్రేజ్‌‌ని మరింతగా పెంచుకున్నాడు.. వెండితెర పై కమెడియన్‌‌గా కనబడుతూనే హీరోగా కూడా అప్పుడప్పుడు మెరుస్తున్నాడు. అయితే సుధీర్ పెళ్లి గురించి గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.


తాజాగా ఓ కామెడీ షోలో సుధీర్‌కు ఎంగేజ్‌మెంట్‌ జరిపించారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇదంతా ఓ స్కిట్‌లో భాగమేనని అందరు అనుకుంటున్నారు. అయ్యయో వద్దమ్మా ఇలాంటివి చాలా చూసాం.. మళ్ళీ అంటే కష్టం, చూసిన వాళ్ళతో ఇలా చేస్తే నమ్మట్లేదని ....కొత్త అమ్మాయిని తీసుకొచ్చారా అని కామెంట్స్ చేస్తున్నారు.


కానీ ఆ అమ్మాయిని చూస్తుంటే ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తిలా కనిపిస్తోంది. దీనితో ఈ షో ద్వారా సుధీర్ తన ప్రేయసిని పరిచయం చేస్తున్నాడా అన్న అనుమానాలు కూడా కొందరిలో మొదలయ్యాయి. ఇక ఈ వీడియో కింద నెటిజన్లు మాత్రం సుధీర్ పక్కన రష్మీని తప్ప మరొకరిని ఊహించుకోలేమని, వారిద్దరిది మంచి జోడీ అంటూ మరికొందరు కామెంట్స్ వదులుతున్నారు. మొత్తానికి ఆ అమ్మాయి ఎవరా అని తెలుసుకునే పనిలో పడ్డారు నెటిజన్లు.

Tags

Read MoreRead Less
Next Story