Sudigali Sudheer: షో లో సుడిగాలి సుధీర్ ఎంగేజ్‌మెంట్ అబద్ధం.! లేటెస్ట్ ప్రోమోలో రివీల్..

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ అంటే బుల్లితెర మన్మధుడు అని తన అభిమానులు భావిస్తుంటారు. ఆల్ రౌండర్‌గా సుధీర్‌కు మంచి క్రేజ్ ఉంది. అయితే తాను హోస్ట్ చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షో కోసం కొత్త కొత్త కాన్సెప్ట్స్ ముందుకొస్తుంటారు మేకర్స్. అలాగే తాజాగా ఆ షోలో సుధీర్ పెళ్లి అయినట్టు ఓ ప్రోమో విడుదల చేశారు. ఆ ప్రోమో రిలీజ్ అయినప్పటి నుండి తెగ వైరల్ అవుతోంది. అయితే తాజాగా అది కూడా రీల్ పెళ్లే అని తేల్చేస్తున్నారు ప్రేక్షకులు.
గ్లామర్ ఇండస్ట్రీలో ఇద్దరు నటీనటులు సన్నిహితంగా ఉన్నారు అంటే వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ కథనాలు పుట్టుకొచ్చేస్తాయి. అయితే వెండితెరపైనే కాదు.. బుల్లితెరపై కూడా ఇది కామన్. అలాగే సుడిగాలి సుధీర్, రష్మి కూడా రిలేషన్‌లో ఉన్నారంటూ రూమర్స్ వచ్చాయి. అలా ఈ కపుల్‌కి క్రేజ్ కూడా పెరిగింది. ఆ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడం కోసం వీరిద్దరికి మొదటిగా రీల్ పెళ్లి చేసింది బుల్లితెర యాజమాన్యం.
రష్మితో రీల్ పెళ్లి తర్వాత తనతో మరో షోను హోస్ట్ చేస్తున్న కో యాంకర్ విష్ణుప్రియను కూడా పెళ్లి చేసుకున్నట్టు యాక్ట్ చేశాడు సుధీర్. అయితే తాజాగా ఓ షోలో తనకు ఓ అమ్మాయితో పెళ్లి జరిగినట్టు విడుదలయిన ప్రోమో మరోసారి సుధీర్ ఫ్యాన్స్‌ను ఇరకాటంలో పడేసింది. అయితే ఇప్పటివరకు ఇలాంటి రీల్ పెళ్లిల్లు చూసిన చాలామంది ఇది కూడా అలాంటిదే అని లైట్ తీసుకున్నారు. అయితే నిజంగానే ఇది మరో రీల్ పెళ్లి అని తేలిపోయింది.
త్వరలో టెలికాస్ట్ కానున్న శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో సుధీర్ పెళ్లిచూపులు అనే కాన్సెప్ట్ ప్రసారం కానుంది. అందులో సుధీర్ కోసం నలుగురు అందమైన ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ను బరిలోకి దించనుంది. ఆ నలుగురు సుధీర్ కోసం పోటీపడగా చివర్లో తేజస్వీ నాయుడు అనే అమ్మాయిని రీల్ పెళ్లి చేసుకున్నాడు సుధీర్. దానినే ప్రోమోగా విడుదల చేసి అందరి దృష్టిని ఆకర్షించారు మేకర్స్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com