సినిమా

Sudigali Sudheer: జబర్దస్త్ నుండి సుడిగాలి సుధీర్ టీమ్ ఔట్.. దానికోసమే ఈ నిర్ణయం..

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్.. తన స్టైల్‌కి, డ్యాన్స్‌కి, గ్రేస్‌కి, విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు.

Sudigali Sudheer (tv5news.in)
X

Sudigali Sudheer (tv5news.in)

Sudigali Sudheer: ఈమధ్య వెండితెర నటీనటులకు ఎంత పాపులారిటీ వస్తుందో.. బుల్లితెర నటీనటులకు కూడా అంతే పాపులారిటీ లభిస్తోంది. వారికి ఉన్న ఫ్యాన్ బేస్, ఫాలోయింగ్ ఇవన్నీ చూస్తుంటే హీరోహీరోయిన్లకు ఏ మాత్రం తగ్గట్లేదుగా అనిపిస్తోంది. అయితే.. దాదాపు చాలామంది అభిమానిస్తున్న ప్రస్తుత బుల్లితెర నటీనటులు ఎక్కువశాతం వచ్చింది 'జబర్దస్త్' అనే ఒక్క షో నుంచే. తాజాగా ఆ షో నుండి ఓ పాపులర్ కమెడియన్ తప్పుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి.

సుడిగాలి సుధీర్.. తన స్టైల్‌కి, డ్యాన్స్‌కి, గ్రేస్‌కి, స్క్రీన్ అప్పీయరెన్స్‌కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. తను బుల్లితెరపై ఎప్పుడు కనిపించినా.. ఏ షోలో కామెడీ చేసినా.. ఏ షోకు హోస్టింగ్ చేసినా.. ఆ షో హిట్ అవ్వాల్సిందే. ఎంత టాలెంట్ ఉన్నా దానిని నిరూపించుకునే ప్లాట్‌ఫార్మ్ కావాలి. వారి టాలెంట్‌ను నలుగురికి చూపించుకోగలిగే అవకాశం కావాలి. సుధీర్‌కు మాత్రమే కాదు.. తనలాంటి ఎంతోమందికి ఆ అవకాశాన్ని కల్పించింది జబర్దస్త్.

ప్రస్తుతం సుధీర్ జబర్దస్త్ మాత్రమే కాకుండా ఈటీవిలోనే శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ లాంటి షోలలో కూడా చేస్తున్నాడు. అంతే కాకుండా సుధీర్‌కు ఇప్పుడిప్పుడే సినిమా అవకాశాలు కూడా వస్తున్నాయి. హీరోగా మాత్రమే కాకుండా హీరో ఫ్రెండ్‌లాగా కూడా పలు సినిమాల్లో కనిపించాడు సుధీర్. అయితే వెండితెరపై బిజీ అవ్వడంతో సుధీర్ జబర్దస్త్ నుండి తప్పుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట.

జబర్దస్త్‌తో ఇప్పటివరకు సుధీర్‌కు ఉన్న అగ్రిమెంట్ ఇటీవల పూర్తయిందని సమాచారం. అయితే కొత్త అగ్రిమెంట్‌పై సైన్ చేయడానికి సుధీర్ ఆసక్తి చూపించట్లేదట. మెల్లగా సినిమాల్లోనే సెటిల్ అయిపోవాలని ఆలోచిస్తున్నట్టు టాక్. ఇక సుధీర్ బాటలోనే తన స్నేహితులు గెటప్ శ్రీను, ఆటో రామ్ ప్రసాద్ కూడా జబర్దస్త్‌ను వీడనున్నారన్న వార్త సోషల్ మీడియాలో షికార్లు చేస్తోంది.

జబర్దస్త్‌లో సుడిగాలి సుధీర్ టీమ్ అందరికీ గట్టి పోటీ ఇస్తోంది. వీరి టీమ్ మొదలయినప్పటి నుండి వీరి కోసమే ప్రత్యేకంగా ప్రోగ్రామ్ చూసే అంత రేంజ్‌కు ఈ టీమ్ ఎదిగింది. అలాంటి వారు జబర్దస్త్ నుండి తప్పుకుంటానంటే షో యాజమాన్యం ఒప్పుకుంటుందా లేదా అసలు ఈ వార్తల్లో నిజముందా లేదా అని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

Divya Reddy

Divya Reddy

TV5 News Desk


Next Story

RELATED STORIES