Sudigali Sudheer: సుధీర్ ఆనంద్ బయానా.. సినిమాలాంటి ఫ్లాష్‌బ్యాక్ ఉందిగా..

Sudigali Sudheer (tv5news.in)
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్.. ఇప్పుడు టెలివిజన్ ఇండస్ట్రీలో ఇది ఒక పేరు కాదు.. ఒక బ్రాండ్. కొన్ని పేర్లు బ్రాండ్‌గా మారడం వెనుక పెద్ద కథే ఉంటుంది. ఎన్నో కష్టాలు, అడ్డంకులు దాటితేనే అందరు మెచ్చే స్థాయికి వస్తారు అనడానికి ఇప్పటికీ మనకి ఎంతోమంది నిదర్శనంగా నిలిచారు. అందులో ఒకరే సుధీర్. ఇప్పుడు గొప్ప స్థాయిలో అందరికీ ఇన్‌స్పిరేషన్‌గా నిలిచే వారి జీవితకథ ఎక్కడినుండి మొదలవుతుందో.. సుధీర్‌ది కూడా అక్కడినుండే మొదలయ్యింది.
ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ.. విజయవాడలో ఉన్నదానితోనే సరిపెట్టుకుంటూ హ్యాపీగా ఉంటున్నారు. కానీ అందులో ఒకరికి మాత్రం స్క్రీన్‌పై కనిపించాలి, పేరు తెచ్చుకోవాలి అని ఉండేది. అంతకు ముందు ఆ కుటుంబం నుండి అలా చేసినవారు ఎవరూ లేరు. అయినా సరే.. ధైర్యం చేసి హైదరాబాద్ వచ్చేశాడు. ఇక్కడ తనకి ఎవరూ తెలీదు. చిన్న చిన్న పాత్రల అవకాశాల కోసం సినిమా ఆఫీస్‌ల చుట్టూ తిరగడం మొదలుపెట్టాడు.
అవకాశాలు రాలేదు. రోజులు, నెలలు గడిచిపోతున్నాయి. తనకు ఎంతో ఇష్టమైన నటన కనీసం పూట గడవడానికి కూడా సహాయం చేయలేకపోతుంది. అప్పుడే తన కడుపు నింపుకోవడం కోసం తనలోని మెజిషియన్‌ను ప్రపంచానికి పరిచయం చేశాడు. స్టేజ్ షోలు చేస్తూ.. మెల్లగా టీవీల్లో కనిపించడం మొదలుపెట్టాడు. పలువురు ఆర్టిస్టుల కాంటాక్స్ దొరికాయి. అలా కమెడియన్ వేణుతో కలిసి ఒక స్టాండప్ కామెడీ షోలో చేయడం మొదలుపెట్టాడు.
వేణుకు మెల్లగా తాను కుడిభుజంలాగా మారాడు. ఆ తరువాత వేణు సినిమాల్లో బిజీ అయ్యాక టీమ్ లీడర్ హోదా తన సొంతమయింది. అప్పటివరకు ఆ షోలో ఎవరూ చేయని కామెడీని, ఆటో పంచ్‌లను ప్రేక్షకులకు రుచి చూపించాడు. మెల్లగా తనకు బయట పేరు రావడం మొదలయ్యింది. కమెడియన్‌తో పాటు తనలో ఓ డ్యాన్సర్ కూడా ఉన్నట్టు ప్రేక్షకులకు పరిచయం చేశాడు. కామెడీ, డ్యాన్స్‌తో మ్యాజిక్ చేశాడు. స్టార్ అయిపోయాడు. అతడే 'సుధీర్ ఆనంద్ బయానా'.
సుధీర్ కథ ఎవరికీ తెలియనిది కాదు.. చాలామందికి తెలుసు.. అంతే కాక చాలామందిని ఇన్స్‌పైర్ చేసింది కూడా. మల్టీ టాలెంట్ అనేదానికి ఒక మంచి ఉదాహరణగా నిలిచే టాలెంట్ సుధీర్ సొంతం. అలా సుధీర్ సక్సెస్‌లో తొలిమెట్టుగా నిలిచిన జబర్దస్త్ కామెడీ షోను తాను వదిలేస్తున్నడని వస్తున్న వార్తలతో తన ఫ్యాన్స్ నిరుత్సాహ పడుతున్నారు. ఈ వార్తలకు చెక్ పెట్టాలంటే సుధీర్ ఏదో ఒక రెస్పాన్స్ ఇవ్వాల్సిందే..
సుధీర్ పాపులారిటీకి సగం తన స్టైల్, సక్సెస్ కారణమయితే.. సగం రష్మితో ప్రేమ వ్యవహారం కారణం. వీరిద్దరు కలిసి చేసిన షోలకు ఇప్పటికీ యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూలు ఉంటాయి. వీరిద్దరు ఆన్ స్క్రీన్ కపుల్ మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ కపుల్ కూడా అయితే బాగుంటుందని చాలామంది అభిమానులు అభిప్రాయపడుతున్నారు కూడా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com