Sudigali Sudheer: మాస్ హీరోగా సుడిగాలి సుధీర్.. 'గాలోడు' టీజర్‌లో ఇదే హైలెట్..

Sudigali Sudheer: బుల్లితెరపై హోస్ట్‌గా, కమెడియన్‌గా, డ్యాన్సర్‌గా.. ఓవరాల్‌గా మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు సుడిగాలి సుధీర్. బుల్లితెరపై తన యాటిట్యూడ్‌తో చాలామందే ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నాడు సుధీర్. ప్రస్తుతం అలాంటి బుల్లితెరకే సుధీర్ దూరమయ్యాడు. అందుకే తన దృష్టి మొత్తం ప్రస్తుతం వెండితెరపైనే ఉంది. తాజాగా తన అప్‌కమింగ్ సినిమా 'గాలోడు' టీజర్ విడుదలయ్యింది.
సుడిగాలి సుధీర్ బుల్లితెరపై ఎంత బిజీగా ఉన్నా.. పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కనిపించాడు. మరికొన్ని సినిమాలలో హీరోగా కూడా చేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేసిన సినిమాలతో పేరొచ్చినా.. హీరోగా చేసిన సినిమాలు మాత్రం తనకు అంత కమర్షియల్‌గా సక్సెస్‌ను అందించలేకపోయాయి. అయినా తన ప్రయత్నం మాత్రం ఆపలేదు.
రాజశేఖర్ రెడ్డి పులిచార్ల దర్శకత్వం వహిస్తున్న 'గాలోడు' సినిమాలో సుధీర్.. పూర్తిస్థాయి మాస్ హీరోగా కనిపించనున్నాడు. టీజర్‌లో తన మాస్ లుక్స్ హైలెట్‌గా నిలిచాయి. గాలోడు టీజర్ కూడా పూర్తిగా మాస్ ఎలిమెంట్స్‌తో, ఫైట్స్‌తో నిండిపోయింది. గెహ్నా సిప్పీ ఈ సినిమాలో సుధీర్‌కు జోడీగా నటిస్తోంది. సీనియర్ నటుడు పోసాని కృష్ణమురళీ ఇందులో కీలక పాత్రలో కనిపించనున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com