Allu Arjun : చరిత్ర సృష్టించిన సుకుమార్, అల్లు అర్జున్

Allu Arjun :  చరిత్ర సృష్టించిన సుకుమార్, అల్లు అర్జున్
X

ఐకన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ రూపొందించిన పుష్ప 2 చరిత్ర సృష్టించింది. ఈ సినిమా వల్ల ఎదురైన వివాదాలు ఎన్ని ఉన్నా.. హిస్టరీలో అల్లు అర్జున్ పేరు నిలిచిపోయేలా చేసింది పుష్ప 2. యస్.. అంతా ఊహించినట్టుగానే ఆల్ టైమ్ హయ్యొస్ట్ కలెక్టెడ్ మూవీస్ లో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది పుష్ప 2. తెలుగు నుంచి ఇప్పటి వరకూ ఈ ప్లేస్ లో ఉన్న బాహుబలి 2 పుష్ప 2 దెబ్బకు థర్డ్ ప్లేస్ కు వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే పుష్ప2 ఈ రికార్డ్ ను అతి తక్కువ రోజుల్లోనే క్రియేట్ చేయడం అసలు మజా. కేవలం 32 రోజుల్లోనే 1831 కోట్ల గ్రాస్ వసూలు చేసి వారెవ్వా అనిపించింది.

పుష్ప 2 సాధించిన ఈ రికార్డ్ చిన్నదైతే కాదు. రాజమౌళి లా.. మగధీర,ఈగ, బాహుబలితో ముందే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని కొట్టిన హిట్టు కాదు. సుకుమార్ గురించి నార్త్ లో పెద్దగా తెలియదు. ఫస్ట్ పార్ట్ తోనే అతను పరిచయం అయ్యాడు. అయినా అతను అల్లు అర్జున్ చాటునే ఉండిపోయాడు. అసలు ఇవన్నీ కాదు.. అస్సలే మాత్రం అంగీకారం కానీ కథతో ఊరమాస్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయడం.. అందునా పెద్దగా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ లేకుండా.. ‘హాలీవుడ్ రేంజ్ మూవీ’ అనే టాక్ లేకుండా పుష్ప 2 ఈ రికార్డ్ ను సాధించడం సాధారణ విషయం అయితే కాదు. అసలు ఇది కాదు.. ‘చైనా’ మార్కెట్ లేకుండా సాధించడం అనేదే అసలు అత్యంత పెద్ద విజయం.

పుష్ప ది రైజ్ కు, పుష్ప ది రూల్ కు మధ్య మూడేళ్ల గ్యాప్. ఆ గ్యాప్ ను అద్భుతమైన కలెక్షన్స్ తో ఫిల్ చేసిన దర్శక చాణక్యం సుకుమార్ ది అయితే.. తను నమ్మిన పాత్ర కోసం ప్రాణం పెట్టిన కష్టం అల్లు అర్జున్ ది. వీరికి తోడు రష్మిక మందన్నా.. గ్లామర్ తో పాటు నటనతోనూ కట్టి పడేసిన వైనం.. బాలేదు బాలేదు అంటూనే భలే ఉందే అనిపించేలా చేసిన దేవీ శ్రీ ప్రసాద్ మ్యాజిక్. యాక్షన్ ఎపిసోడ్స్, సుదీర్ఘంగా సాగిన జాతర ఎపిసోడ్.. అల్లు అర్జున్ డైలాగ్ డెలివరీ.. ఇవన్నీ సినిమాను మరో స్థాయికి తీసుకువెళ్లాయి. అన్నటికీ మించి నెగెటివ్ క్యారెక్టరైజేషన్ తో ఒక హీరో ఇన్ని కోట్లు కొల్లగొట్టడం ఇప్పటి వరకూ ఇండియన్ సినిమా హిస్టరీలోనే లేదు. అందుకే పుష్ప 2 ది కేవలం రికార్డ్ మాత్రమే కాదు.. చరిత్ర. ఇంకెవరు అందుకున్న.. దీన్ని విస్మరించడం కుదరదు అనేంత పెద్ద చరిత్ర.

Tags

Next Story