Sukumar Pushpa 2 : మేకింగ్ వీడియోతో మెస్మరైజ్ చేసిన సుకుమార్

Sukumar Pushpa 2 :  మేకింగ్ వీడియోతో మెస్మరైజ్ చేసిన సుకుమార్
X

సినిమా ప్రమోషన్స్ కోసం కొన్నాళ్లుగా మేకింగ్ వీడియోస్ కూడా విడుదల చేస్తున్నారు. అయితే అన్ని మేకింగ్ వీడియో ఆకట్టుకోవు. కొందరైతే సినిమా హిట్ అయిన తర్వాత రిలీజ్ చేస్తుంటారు. బట్ పుష్ప 2 మేకింగ్ వీడియో చూస్తే గూస్ బంప్స్ అనేలా ఉంది. అందుకు దేవీ శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోడవడంతో మరింత హైప్ క్రియేట్ అయ్యేలా ఉంది. మామూలుగా స్టార్ హీరోల మేనరిజంస్ లో ఎక్కువ భాగం వాళ్లు క్రియేట్ చేసుకుంటారు అనుకుంటారు చాలామంది. బట్ ఖుషీలో పవన్ కళ్యాణ్ అ.. అ.. అనే డైలాగ్ మాడ్యులేషన్ కానీ, మెడపై చేయ్యి పెట్టి సీరియస్ గా చూసే మేనరిజం కానీ దర్శకుడు ఎస్.జే సూర్యదే అనేది నిజం.

ఇక పుష్ప లో ఆ పాత్ర ఎలా ప్రవర్తించాలి అనే విషయంపై దర్శకుడు సుకుమార్ కు స్పష్టమైన అవగాహన ఉన్నట్టుగా ఈ మేకింగ్ వీడియో చూస్తే అర్థం అవుతుంది. తగ్గేదే లే అన్నప్పుడు సింగిల్ హ్యాండ్.. అస్సలు తగ్గేదే లే అన్నప్పుడు డబుల్ హ్యాండ్స్ తో గడ్డం కింద నుంచి చెయ్యి తిప్పడం.. టీజర్ లో కనిపించిన జాతర ఎపిసోడ్ లో అగ్రెసివ్ నెస్.. ఇవన్నీ సుకుమార్ చేసి చూపించినవే అని ఈ వీడియోలో తెలుస్తోంది. వాటిని తనదైన శైలిలో ఇంప్రవైజ్ చేసి ఇమేజ్ కు, పాత్రకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా చేశాడు అల్లు అర్జున్.

నిజానికి ఈ మేకింగ్ వీడియోతోనే తెలియని ఓ వైబ్ కనిపిస్తోంది. ఇంక సినిమాలో చూస్తే ఓ రేంజ్ లో ఉంటుందేమో. ఏదేమైనా ఈ మేకింగ్ వీడియోతో సుకుమార్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేశాడనే చెప్పాలి. ఆల్మోస్ట్ మెయిన్ ఆర్టిస్టులంతా కనిపించారీ వీడియోలో. కాకపోతే అనసూయ, సునిల్ మిస్ అయ్యారు.

Tags

Next Story