సినిమా

Sukumar : క్లైమాక్స్‌లో బన్నీని నగ్నంగా చూపించాలనుకున్నా.. కానీ : సుకుమార్

Sukumar : అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్‌ మూవీ 'పుష్ప-ది రైజ్‌'. భారీ అంచనాల మధ్య డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం

Sukumar :  క్లైమాక్స్‌లో బన్నీని నగ్నంగా చూపించాలనుకున్నా.. కానీ  : సుకుమార్
X

Sukumar : అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన హ్యాట్రిక్‌ మూవీ 'పుష్ప-ది రైజ్‌'. భారీ అంచనాల మధ్య డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్ళు సాధిస్తోంది.. బన్నీ నటనకి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.. పక్కా ఊరమాస్‌ గెటప్‌లో బన్నీ ఈ సినిమాలో కనిపించడంతో పండగ చేసుకుంటున్నారు.

అయితే ఈ సినిమా క్లైమాక్స్‌లో విలన్‌ ఫహద్‌ ఫాజిల్‌, అల్లు అర్లున్‌ అర్థనగ్నంగా కనిపించిన విషయం తెలిసిందే. ఇద్దరు అండర్ వేర్ లో కనిపిస్తూ పోటాపోటీగా డైలాగ్స్ చెప్పారు. ఇది ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ సీన్ పైన దర్శకుడు సుకుమార్ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు.

"పుష్ప క్లైమాక్స్‌లో బన్నీ, ఫహాద్‌ ఇద్దరూ ప్యాంట్‌ షర్ట్‌ విప్పేసి సవాళ్లు విసురుకుంటారు. నిజానికి ఆ సీన్‌లో ఇద్దరినీ నగ్నంగా చూపించాలనుకున్నా. కానీ, తెలుగు ప్రేక్షకులు ఇలాంటి సీన్స్‌ను అంగీకరించరని తెలిసి అప్పటికప్పుడు మార్పులు చేశాం" అని వెల్లడించాడు.

ఇక సినిమాలోని అసలు కథ రెండో పార్ట్ లో ఉందని కేవలం పాత్రల పరిచయం వరకే పార్ట్ వన్ అని చెప్పుకొచ్చాడు. కాగా ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది.

Next Story

RELATED STORIES