సుకుమార్ రైటింగ్స్ ని ఇక పై భార్య తబిత..

సుకుమార్ రైటింగ్స్ ని ఇక పై భార్య తబిత..
సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు సుకుమార్ లెక్క తప్పకుండా మంచి సినిమాలు పక్కాగా రూపొందిస్తారు.

సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు సుకుమార్ లెక్క తప్పకుండా మంచి సినిమాలు పక్కాగా రూపొందిస్తారు. తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ లో సినిమాలు తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

ఈ ఏడాది మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి నిర్మించిన చిత్రం ఉప్పెన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ నిర్మాణ సంస్థకు సంబంధించి సుకుమార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

దీనికి సంబంధించిన బాధ్యతలు తన భార్య తబితకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు ఈ విషయాలన్నీ తన స్నేహితుడు, మేనెజర్ ప్రసాద్ చూసుకునేవారు. ఇటీవల ఆయన గుండెపోటుతో మరణించారు.

దీంతో ఆ బాధ్యతల్ని తబితకు అప్పగించాలని చూస్తున్నారు. సుకుమార్ సూచనలతో తబిత కంపెనీ వ్యవహారాలు చక్కబెడతారు. కాగా, ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ తో పాన్ ఇండియా మూవీ పుష్ప తీస్తున్నారు.

ఇది వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడవ చిత్రం. అందుకే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సుకుమార్ రైటింగ్స్ నుంచి వస్తున్న మరో చిత్రం నిఖిల్ తో నిర్మిస్తున్న 18 పేజెస్. ఈ చిత్రంలో నిఖిల్ సరసన అనుపమా పరమేశ్వరన్ నటిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story