Suma Kanakala Remuneration: హీరోయిన్‌గా సుమ.. రెమ్యునరేషన్ ఓ రేంజ్‌లో..

Suma Kanakala (tv5news.in)
Suma Kanakala Remuneration: తెలుగు తెరపై యాంకర్ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు సుమ. ఎన్నో ఏళ్ల నుండి యాంకర్‌గా సుమ.. ప్రేక్షకులను అలరిస్తోంది. అంతే కాకుండా ఏదైనా ఈవెంట్ ఉన్నా.. ఏదైనా లేడీస్ షో మొదలుపెట్టాలన్నా నిర్మాతలకు ముందుగా సుమ పేరే గుర్తొస్తుంది. సుమ ఉంటే ఈవెంట్ హిట్టే అనుకునేవారు కూడా లేకపోలేదు. అయితే బుల్లితెరపై అలరించిన సుమ.. వెండితెరపై ఎంట్రీ ఇవ్వడానికి భారీ పారితోషికమే డిమాండ్ చేస్తోందట.
తెలుగులో చాలామంది యాంకర్లు ఉన్నారు. కానీ వారంతా కొంతకాలం రాణించిన తరువాత కనుమరుగయిపోయారు. కానీ సుమ మాత్రమే పదేహేనళ్లకు పైగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. మలయాళ అమ్మాయి అయినా.. తెలుగులో స్పష్టంగా మాట్లాడుతూ.. మన ఇంట్లో మనిషిలాగా కలిసిపోయింది. అయితే తాజాగా సుమ వెండితెరపై ఓ సినిమాలో లీడ్ రోల్‌లో నటిస్తోంది. అదే 'జయమ్మ పంచాయితి'.
సుమ.. ఎక్కువశాతం బుల్లితెరకే పరిమితమయింది. కానీ అప్పుడప్పుడు వెండితెరపై కూడా పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ఎప్పుడూ ఈవెంట్లతో, ప్రోగ్రామ్‌లతో బిజీగా ఉండే సుమ.. ఇటీవల జయమ్మ పంచాయతి అనే చిత్రంలో నటించింది. విజయ్ కుమార్ కలివారపు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ మూవీ నుండి టీజర్‌తో పాటు ఓ పాట కూడా విడుదలయ్యింది.
యాంకర్‌లలో స్టార్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సుమ.. ఒక్కొక్క ఈవెంట్ కోసం రూ. 1 నుండి 2 లక్షల వరకు ఛార్జ్ చేస్తుందని టాక్. అయితే తన బిజీ షెడ్యూల్‌లో టైమ్ తీసుకుని జయమ్మ పంచాయతి సినిమాలో నటించిన సుమ.. ఈ చిత్రం కోసం ఏకంగా రూ. 50 లక్షలు డిమాండ్ చేసిందట. సుమ నటించిన సినిమా అంటే హైప్ వస్తుంది కాబట్టి నిర్మాతలు కూడా ఆ రెమ్యునరేషన్ ఇవ్వడానికి వెనకాడలేదని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com