Amardeep Chowdary : ఆకట్టుకునేలా సుమతీ శతకం మూవీ

కొన్ని సినిమాలు రిలీజ్ కు ముందే టాప్ టాక్ తెచ్చుకుంటాయి. కంటెంట్ పరంగా, ప్రమోషన్స్ పరంగా లేదంటే టీజర్, ట్రైలర్ తో ముందుగానే విజయం కాబోతున్నాయి అనిపిస్తాయి. అలాంటి మూవీయే సుమతీ శతకం. బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ హీరోగా నటించిన మూవీ ఇది. ఈ నెల 6న విడుదల కాబోతోంది. ఎమ్ఎమ్ నాయుడు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సయాలీ చౌధరి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీపై ముందు నుంచీ భారీ అంచనాలున్నాయి. ఖచ్చితంగా విజయం సాధించబోతోన్న మూవీ అనిపించుకుంది. అదే నిజం అన్నట్టుగా అద్భుతమైన ప్రమోషన్స్ తో ఆకట్టుకున్నాడు అమర్ దీప్. ఈ మూవీని పూర్తిగా తన భుజాలపై తీసుకువెళుతున్నాడు అమర్ దీప్. ప్రమోషన్స్ విషయంలో రెండు రాష్ట్రాల్లోనూ తిరుగుతూ ఆకట్టుకున్నాడు. ఓ రకంగా ఒన్ మేన్ షో అన్నట్టుగా కనిపించాడు. ప్రొడ్యూసర్ కొమ్మాలపాటి సాయి సుధాకర్ ని ఈ విషయంలో మెచ్చుకోవాల్సిందే.
టీజర్, ట్రైలర్ కు పూర్తిగా పాజిటివ్ వచ్చింది. ముఖ్యంగా అమర్ దీప్ టైమింగ్ బావుండేలా ఉంది. హీరోయిన్ కూడా చాలా బావుంది. నటన పరంగా కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇతర పాత్రల్లో టేస్టీ తేజ, మిర్చి కిరణ్ కీలకంగా కనిపించబోతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉండబోతోంది. ఈ తరహా కథలు నిజంగానే ఆకట్టుకుంటాయి. మొత్తంగా అమర్ దీప్ కు ఈ మొదటి సినిమాతోనే భారీ విజయం రాబోతోంది అనిపిస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
