Sundeep Kishan: బాలీవుడ్ బ్యూటీతో ప్రేమలో పడిన యంగ్ హీరో..?

Sundeep Kishan: బాలీవుడ్ బ్యూటీతో ప్రేమలో పడిన యంగ్ హీరో..?
Sundeep Kishan: సందీప్ ప్రస్తుతం సోనియా రాధే అనే బాలీవుడ్ నటితో ప్రేమలో ఉన్నాడట.

Sundeep Kishan: ప్రస్తుతం టాలీవుడ్‌లో హీరోలు, హీరోయిన్ల లవ్ స్టోరీలు ఎక్కువయిపోయాయి. అవి నిజమో కాదో తెలియదు కానీ.. ఎప్పటికప్పుడు పలువురు నటీనటులపై రూమర్స్ అయితే వైరల్ అవుతున్నాయి. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్.. బాలీవుడ్ భామతో ప్రేమలో పడినట్టు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంతకీ ఎవరా బాలీవుడ్ బ్యూటీ అనుకుంటున్నారా..


హీరో సందీప్ కిషన్.. ఎక్కువగా తొందరపడి సినిమాలు చేసే రకం కాదు. తనకు నచ్చిన కథ కోసం ఎంతకాలం అయినా వెయిట్ చేస్తాడు. అంతే తన దగ్గర నుండి సంవత్సరానికి కేవలం ఒక సినిమా లేదా అప్పుడప్పుడు రెండు సినిమాలు వస్తూ ఉంటాయి. అయితే కెరీర్ ప్రారంభంలోనే ఒకట్రెండు సార్లు హిందీ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను కూడా పలకరించాడు సందీప్.


సందీప్ ప్రస్తుతం సోనియా రాధే అనే బాలీవుడ్ నటితో ప్రేమలో ఉన్నాడట. సోనియా వెండితెరపై పెద్దగా కనిపించలేదు. 'బ్రోకెన్ బట్ బ్యూటిఫుల్' అనే వెబ్ సిరీస్.. ఆమెను ప్రేక్షకులకు దగ్గర చేసింది. వీరిద్దరు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకున్నారట. అయితే సందీప్, సోనియా మధ్య పరిచయం ప్రేమగా మారి వీరిద్దరు కలిసి ముంబాయిలో చక్కర్లు కూడా కొడుతున్నారంటూ రూమర్స్ వైరల్ అవుతున్నాయి.



Tags

Read MoreRead Less
Next Story