Sunil: అప్పుడు బంకు శ్రీను.. ఇప్పుడు మంగళం శ్రీను.. 19 ఏళ్లలో ఇంత మార్పా..?

Sunil (tv5news.in)
Sunil: సినిమా కథలు మాత్రమే కాదు.. నటీనటులు కూడా రొటీన్‌గా ఉన్నా ప్రేక్షకులు ఇష్టపడట్లేదు. అందుకే నటీనటులు కూడా తాము స్టార్లు అన్న విషయాన్ని మర్చిపోయి, డిఫరెంట్ పాత్రలను ఎంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అందుకోసం ఎంత చేంజ్ ఓవర్‌కు అయినా ఓకే అనేస్తు్న్నారు. పుష్ప సినిమా ఫస్ట్ లుక్స్ చూస్తుంటే మరోసారి ఇదే విషయం స్పష్టమవుతోంది.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ సినిమా 'పుష్ప'. ఒకప్పుడు దర్శకుడు సుకుమార్ పేరు చెప్పగానే హీరోలను స్టైలిష్‌గా, ఇంటెలిజెంట్‌గా చూపిస్తాడు, హీరోయిన్స్‌ను మోడర్న్‌గా చూపించి ఆడియన్స్ మతిపోగొడతాడు అనే అభిప్రాయం ఉండేది ప్రేక్షకులకు. కానీ ఇప్పుడు సుకుమార్ అలా కాదు. చాలా మారిపోయారు.
స్టైలిష్ సినిమాలు మాత్రమే తెరకెక్కించే సుకుమార్.. రంగస్థలం నుండి తన స్టైల్‌నే మార్చేశారు. అందులో రామ్ చరణ్‌ను మాస్ లుక్‌లో, సమంతను డీ గ్లామర్ పాత్రలో చూపించిన సుకుమార్.. పుష్పలో కూడా అదే పని చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలయిన అల్లు అర్జున్, రష్మిక ఫస్ట్ లుక్స్ చూస్తుంటే.. రంగస్థలంకు, పుష్పకు చాలా దగ్గర పోలికలు ఉన్నట్టుగా కనిపిస్తోంది.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న పుష్ప కూడా బాహుబలి లాగానే రెండు భాగాల్లో విడుదల కానుందని మూవీ టీమ్ ఇప్పటకే స్పష్టం చేసింది. అయితే ఇందులోని మొదటి భాగంలో మెయిన్ విలన్‌గా ఫాహద్ ఫాజిల్ నటిస్తున్నాడని ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేసింది పుష్ప టీమ్. కానీ ఫాహద్ పుష్ప పార్ట్ 1 చివరిలోనే ఎంట్రీ ఇస్తాడని రూమర్స్ వినిపిస్తున్నాయి.
ఒకవేళ ఫాహద్ ఫాజిల్ పార్ట్ 1 చివరిలో వస్తే.. మరి సినిమాలో మెయిన్ విలన్ ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం కూడా దొరికేసింది. పుష్పలో 'మంగళం శ్రీను' పాత్రలో నటిస్తున్న సునీల్ ఇందులో మెయిన్ విలన్ అని నెటిజన్ల భావన. తాజాగా 'మంగళం శ్రీను'గా విడుదలయిన సునీల్ ఫస్ట్ లుక్ కూడా ఈ అనుమానాలను నిజమే అనిపించేలా చేస్తోంది. 19 ఏళ్ల క్రితం మన్మథుడు సినిమాలో బంకు శ్రీనుగా నటించి ప్రేక్షకులను నవ్వించిన సునీల్.. ఇప్పుడు పూర్తిగా తన క్యారెక్టరైజేషన్‌ను మార్చేసుకుని 'మంగళం శ్రీను'గా భయపెట్టనున్నాడు.
Presenting the face of evil 😈
— Pushpa (@PushpaMovie) November 7, 2021
Introducing @Mee_Sunil as #MangalamSrinu from #PushpaTheRise 🔥#PushpaTheRiseOnDec17@alluarjun @iamRashmika @aryasukku #FahadhFaasil @Dhananjayaka @ThisIsDSP @adityamusic @MythriOfficial pic.twitter.com/zRSNH9tFnw
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com