Sunil: విలన్ క్యారెక్టర్‌లో హీరోలు.. ఇరగదీస్తున్నారు..

Sunil: ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు డైలాగ్ ఇప్పడు సునీల్‌కి కూడా అన్వయించుకోవచ్చేమో. కామెడీ హీరో విలన్ కారెక్టర్‌లో ఒదిగిపోతే వాడే మంగళం శ్రీను అంటారేమో ఇక నుంచి సునీల్ అభిమానులు. బంకు శీను అవతారమెత్తి కామెడీ పండించినా.. కరుడు గట్టిన విలన్ పాత్ర పోషించి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తా అంటున్నాడు సునీల్.
ఓ నటుడికి ఏ పాత్ర ఇచ్చినా అందులో ఇమిడి పోవడం ముఖ్యం. మరీ కామెడీ యాక్టర్‌ని తీసుకొచ్చి విలన్ పాత్రలో చూపిస్తామంటే ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనుకోవచ్చు. కానీ దాన్ని ఓ ఛాలెంజింగ్‌గా తీసుకొని అవలీలగా నటించేస్తున్నారు.. ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంటున్నారు మన హీరోలు. ఇంతకు ముందు జగపతి బాబు, శ్రీకాంత్ హీరోలుగా మెప్పించి, ఇప్పుడు విలన్‌లుగా కూడా తమదైన నటనను కనబరుస్తున్నారు. హీరోలుగా అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉందో.. విలన్‌గా కూడా అంతే క్రేజ్‌ని సంపాదించుకుంటున్నారు.
సునీల్ కెరీర్ కామెడీ రోల్స్‌తో స్టార్ట్ అయినా.. కలర్‌ఫోటో సినిమాలో విలనిజాన్ని పండించాడు.. ఆ సినిమాలో యాక్టింగే ఓ రేంజ్లో ఉందనుకుంటే హెడ్స్ అండ్ టెయిల్స్ లో విలన్ క్యారెక్టర్‌ని నెక్ట్స్ లెవెల్‌కి తీసుకువెళ్లాడు. ఇందులో సునీల్ చిటికేసిన బిట్ ఒకటి ఉంటుంది.. ఆ సౌండ్‌కి ప్రేక్షకులనుంచి రీ సౌండ్ రెస్పాన్స్ గ్యారెంటీ. ఇప్పుడు అదే వరుసలో మరో సినిమా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప.
చూస్తుంటే విలన్ క్యారెక్టర్‌లు చేస్తున్న శ్రీకాంత్, జగపతి బాబులకు గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నాడు. సునీల్ హీరోగా ఒకటి, రెండు సినిమాలను మాత్రమే ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు.. అయితే విలన్‌గా తన సినిమా కెరీర్ దూసుకుపోతుందేమో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com