Sunny Leone : ఆ హీరోకి స్నేహితురాలిగా నటించనున్న సన్నీలియోన్..

X
Sunny Leone : సన్నీలియోన్ టాలీవుడ్ సినిమాలో మళ్లీ నటించనుంది. మంచు విష్ణు సన్నీలియోన్ ఇద్దరూ మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. మంచు మనోజ్‌తో కలిసి గతంలో కరెంట్ తీగ మూవీ నటించింది. తాజాగా మంచు విష్ణుతో జిన్నా చిత్రంలో స్నేహితురాలిగా కనిపించనుంది. అందులో ఆమె పాత్రపేరు రేణుక. పాయల్ రాజ్‌పుత్ కూడా హీరోయిన్‌గా నటించనుంది. ఈషాన్ సూర్య దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని తెలుగుతోపాటు తమిళ్, మళయాళం, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేయనున్నారు.
జిన్నా మూవీలో నటించడం ద్వారా మంచి అనుభవం దక్కిందని సినిమాకు సంబంధించిన విషయాలను సన్నీలియోన్ సోషల్ మీడియాలో పంచుకుంది. అయితే ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు కాబోతోందనేది మేకర్స్ ప్రకటించలేదు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
