Sunny Leone: సన్నీ లియోన్ పెళ్లిరోజు పోస్ట్.. అప్పుడు డబ్బులు లేక అలా చేశామంటూ..

Sunny Leone: బాలీవుడ్‌లోని హాట్ బ్యూటీల్లో ఎక్కువ ఫోకస్ ఉన్న భామ సన్నీ లియోన్. ఓ పార్న్ స్టార్‌గా తన కెరీర్‌ను స్టార్ట్ చేసి ప్రస్తుతం బాలీవుడ్‌లోనే గుర్తింపు ఉన్న నటిగా స్థిరపడిపోయింది సన్నీ. తన గురించి ఎవరు ఎలా మాట్లాడినా.. తనపై ఎలాంటి నెగిటివిటీ ఉన్నా వాటిని ధైర్యంగా ఎదుర్కుంటూ తన కెరీర్‌ను సక్సెస్ చేసుకుంది ఈ నటి. అయితే తాజాగా తమ పెళ్లిరోజు సందర్భంగా సన్నీ లియోన్ పెట్టిన పోస్ట్ నెటిజన్లను ఆకర్షిస్తోంది.
సన్నీ లియోన్.. అమెరికాకు చెందిన మ్యూజిషియన్, యాక్టర్ అయిన డ్యానియల్ వెబర్‌ను పెళ్లి చేసుకుంది. డ్యానియల్ 'జాక్‌పాట్' అనే హిందీ చిత్రంలో కూడా నటించాడు. ఇందులో సన్నీలియోన్ హీరోయిన్. అప్పటికే వీరిద్దరికి వివాహం కూడా అయ్యింది. ప్రస్తుతం డ్యానియల్ ప్రమోటర్‌గా, సన్నీ లియోన్ నటిగా మంచి స్థాయిలోనే ఉన్నారు. కానీ వీరు ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డారో సన్నీ షేర్ చేసిన పెళ్లిరోజు పోస్ట్‌లో చెప్పుకొచ్చింది.
'11 ఇయర్స్ మ్యారేజ్ యానివర్సరీ. ఆ సమయంలో మా దగ్గర డబ్బులు లేవు. రిసెప్షన్ కోసం పెళ్లిరోజు వచ్చిన గిఫ్ట్ కార్డులను ఓపెన్ చేశాం. ఏర్పాటు అన్నీ తప్పుగా జరిగాయి. తాగిన వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. వెడ్డింగ్ కేక్ అయితే అస్సలు బాలేదు. అక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చాం. నీ ప్రేమ లేకపోతే ఇదంతా సాధ్యమయ్యేది కాదు.' అంటూ తన భర్తకు యానివర్సరీ విషెస్‌ను తెలియజేసింది సన్నీ లియోన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com