Sunny Leone: సన్నీ లియోన్‌పై సైబర్ నేరగాళ్ల కన్ను.. పాన్ కార్డ్ ఉపయోగించి..

Sunny Leone (tv5news.in)
Sunny Leone:సెలబ్రిటీ అయినా, మామూలువారు అయినా.. సెబర్ నేరగాడి చూపు నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఒక్కొక్కసారి సైబర్ నేరగాడి వలలో పడి లక్షల్లో రూపాయలు పోగొట్టుకున్న వారు కూడా ఉన్నారు. తాజాగా అలాంటి సైబర్ నేరగాళ్ల చూపు బాలీవుడ్ భామ సన్నీ లియోన్‌పై పడింది. తనకు జరిగిన ఘటన గురించి సన్నీ ఇటీవల తన ట్విటర్ ద్వారా బయటపెట్టింది.
సన్నీ లియోన్ ప్రస్తుతం ఎక్కువగా సోషల్ మీడియా ద్వారానే తన ఫ్యాన్స్‌కు అందుబాటులో ఉంటుంది. కొంతకాలం క్రితం సినిమాలతో, ప్రైవేట్ సాంగ్స్‌తో అలరించిన సన్నీ.. ప్రస్తుతం కెమెరా ముందుకు రావడం తగ్గించేసింది. పూర్తిగా ఫ్యామిలీ ఉమెన్‌గా మారిపోయింది. అయితే తాజాగా సన్నీ లియోన్ పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతోంది.
'ఇది ఇప్పుడే నాకు జరిగింది. దారుణం. ఎవరో నా పాన్ కార్డ్‌ను ఉపయోగించి రూ.2000 లోన్ తీసుకున్నాడు. అంతే కాకుండా నా సిబిల్ స్కోర్‌ను కూడా ఉపయోగించుకున్నాడు.' అని ట్వీట్ చేసింది సన్నీ లియోన్. అంతే కాకుండా ఈ ట్వీట్‌లో ఐవీఎల్ సెక్యూరిటీస్, ఐబీ హోమ్ లోన్స్ ట్విటర్ అకౌంట్స్‌ను ట్యాగ్ చేసింది. దీంతో ఆ సంస్థలు వెంటనే తనకు స్పందించాయి.
ఆ సమస్య వెంటనే పరీష్కారమవ్వడంతో సన్నీ వెంటనే వారికి ధన్యవాదాలు తెలిపింది. అంతే కాకుండా ఇలాంటివి మరొకసారి జరగకుండా ఉండేలా చూసుకోమని తెలిపింది. సన్నీ లియోన్ తన సమస్య గురించి చెప్పగానే వెంటనే పలువురు తమరికి కూడా ఇలాంటి సమస్య ఎదురయ్యిందంటూ ట్వీట్లు చేయడం మొదలుపెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com