Sunny Leone : మందిరలా భయపెట్టబోతోన్న సన్నిలియోన్

సన్నీ లియోన్ తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంది. ఇది వరకు కామెడీ, హారర్ ఇలా అన్ని జానర్లతో ఆడియెన్స్ ముందుకు వచ్చారు. మరోసారి సన్నీ లియోన్ తెలుగు ఆడియెన్స్‌ను భయపెట్టేందుకు ‘మందిర’ అంటూ రాబోతోన్నారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద సన్నీ లియోన్ ప్రధాన పాత్రలో ‘మందిర’ చిత్రాన్ని కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మించారు. ఈ మూవీకి ఆర్ యువన్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే మందిర సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్, పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. నవంబర్ 22న మందిర చిత్రం థియేటర్లోకి రాబోతోంది. ఇకపై మందిర టీం ప్రమోషన్స్‌తో సినిమా మీద మరింత హైప్ పెంచేందుకు సిద్దం అవుతోంది. ఈ చిత్రానికి జావెద్ రియాజ్ సంగీతం అందించారు. దీపక్ డి. మీనన్ కెమెరామెన్‌గా పని చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com