Janhvi Kapoor : జాన్వీ కపూర్ మరో హిట్ కొట్టేలా ఉందిగా

Janhvi Kapoor :  జాన్వీ కపూర్ మరో హిట్ కొట్టేలా ఉందిగా
X

స్టోరీ సెలెక్షన్ లో జాన్వీ కపూర్ స్టైల్ వేరే కనిపిస్తోంది. రెగ్యులర్ హీరోయిన్ మూవీస్ కు మాత్రం ఓకే చెప్పడం లేదు. చెప్పినా తన పాత్ర కొంత భిన్నంగా ఉండేలా చూసుకుంటోంది. రీసెంట్ గా పరమ్ సుందరి మూవీతో ఆకట్టుకుంది జాన్వీ. కాకపోతే ఆ మూవీ ఆశించినంత పెద్ద విజయం సాధించలేదు. ప్రస్తుతం తను ‘సన్నీ సంస్కారీ కి తులసి కుమారి’ అనే మూవీతో వస్తోంది. వరుణ్ ధావన్ హీరోగా నటించిన ఈ మూవీలో సాన్యా మల్హోత్రా, రోహిత్ సరఫ్ మరో జంటగా నటించారు. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ తోనే విపరీతమైన నవ్వులు పూయిస్తోంది. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లా కనిపిస్తోందీ ట్రైలర్.

షషాంక్ ఖైతన్ ఈ సన్నీ సంస్కారీ కి తులసి కుమారి చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ట్రైలర్ ను బట్టి చూస్తే.. సన్నీ అనే కుర్రాడు అనన్య అనే అమ్మాయిని ప్రేమిస్తాడు.తన ఫేవరెట్ సినిమా బాహుబలి అని ఆ గెటప్ లో వెళ్లి ప్రపోజ్ చేస్తాడు. కానీ తను రిజెక్ట్ చేస్తుంది. తులసి అనే అమ్మాయి విక్రమ్ అనే అబ్బాయిని ప్రేమిస్తుంది. కానీ విక్రమ్, అనన్య పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతారు. అంటే సన్నీ, తులసిల ఎక్స్ లు కలిసి పెళ్లికి రెడీ అవుతారన్నమాట. కట్ చేస్తే సన్నీ, తులసి కలిసి ఆ ఇద్దరినీ కవ్విస్తూ.. మళ్లీ తమను ప్రేమించేలా చేసుకోవాలని ప్రయత్నాలు ప్రారంభిస్తారు. తులసి హాట్ గా, సన్నీ స్టైల్ గా కనిపిస్తూ.. అనన్య, విక్రమ్ పెళ్లిలో వారిని ఇరిటేట్ చేస్తుంటారు. మరి ఈ క్రమంలో వాళ్ల పెళ్లి అవుతుందా ఆగుతుందా.. ఈ ఇద్దరూ కొత్తగా ప్రేమలో పడతారా అనేలా ఉంది ట్రైలర్.

ట్రైలర్ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. మంచి వినోదం గ్యారెంటీ అనేలా ఉంది. చూస్తుంటే వరుణ్ అండ్ జాన్వీకి ఓ సూపర్ ఎంటర్టైనింగ్ హిట్ పడేలా కనిపిస్తోంది ఈ ట్రైలర్ చూస్తుంటేనే.

Tags

Next Story