Super Star Krishna: అభిమానుల సందర్శనార్ధం గచ్చిబౌలి స్టేడియంకు కృష్ణ పార్థివదేహం..

Super Star Krishna: అభిమానుల సందర్శనార్ధం గచ్చిబౌలి స్టేడియంకు కృష్ణ పార్థివదేహం..
Super Star Krishna: సూపర్‌స్టార్‌ కృష్ణ కన్నుమూశారు. తెల్లవారుజామున 4గంటలకు తుదిశ్వాస విడిచారు. అశేష అభిమానఘనాన్ని వదిలి దివికేగారు.

Super Star Krishna: సూపర్‌స్టార్‌ కృష్ణ కన్నుమూశారు. తెల్లవారుజామున 4గంటలకు తుదిశ్వాస విడిచారు. అశేష అభిమానఘనాన్ని వదిలి దివికేగారు. కృష్ణ భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్ధం గచ్చిబౌలి స్టేడియానికి తరలించారు. కృష్ణ మృతి పట్ల తెలుగు సినీపరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సీఎం కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. సినీ ప్రముఖులు సూపర్‌స్టార్ కృష్ణను కడసారి చూసేందుకు వస్తున్నారు.

సూపర్‌స్టార్‌ కృష్ణ ఇక లేరు అనే వార్తను అభిమానులు, ఆత్మీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ అభిమాన నటుడిని, ఓ మహామనిషిని ఆఖరిసారి చూసేందుకు హైదరాబాద్‌కు భారీగా తరలివస్తున్నారు. ఏదో చిన్న అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్లారనుకున్నారు గాని.. ఇలా తమందరినీ విడిచి వెళ్తారని అనుకోలేదని అభిమానలోకం మొత్తం కన్నీరు పెట్టుకుంటోంది. మొదట చిన్న అనారోగ్యమే అన్నారు. ఊపిరి ఆడడం లేదని ఆస్పత్రికి తీసుకొచ్చాం.. వెంటనే ఇంటికొచ్చేస్తారు అన్నారు.


ఆ తరువాత.. డాక్టర్లు బులిటెన్లు విడుదల చేస్తున్నారనే సరికి.. ఏదో తెలియని అలజడి. సూపర్‌స్టార్ కృష్ణ మామూలు చెకప్‌లో భాగంగా ఆస్పత్రికి రాలేదని.. కార్డియాక్‌ అరెస్ట్‌తో వచ్చారని వైద్యులు చెప్పేసరికి.. అభిమానుల గుండె ఆగినంత పనైంది. అలా ఒక్కో షాకింగ్‌ న్యూస్ చెబుతూ వచ్చారు. కృష్ణ చాలా క్రిటికల్ సిచ్యుయేషన్‌లో ఉన్నారని చెప్పారు. ఆ తరువాత 24 గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేం అన్నారు.


తాము వైద్యం అందించినా.. ఆయన శరీరం ట్రీట్‌మెంట్‌కు సహకరిస్తుందో లేదో అని వైద్యులు చెప్పేసరికి.. అభిమానులు, ఆత్మీయులు కుంగిపోయారు. ఇక నుంచి ప్రతి గంట కీలకమేనంటూ వైద్యులు ప్రకటించడంతో.. తమ అభిమాన దేవుడు ఇక దూరమైపోతున్నాడనే భావనకు వచ్చేశారు. ఆ తరువాత సాయంత్రం వచ్చిన మరో బులిటెన్‌లోనూ అదే సమాధానం. ఉదయం నుంచి ప్రయత్నిస్తున్నా.. కృష్ణ ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదన్నారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌ జరుగుతోందని చెప్పారు. అన్ని అవయవాలు ఫెయిల్‌ అవుతున్నాయని, వెంటిలేటర్‌పై ఉన్నారని చెప్పడంతో.. అభిమానులు ఎక్కడివాళ్లు అక్కడే పనులు వదిలేసి హైదరాబాద్‌కు పయనం అయ్యారు.

అభిమానుల్లో అనవసర భయాలు సృష్టించడం ఎందుకని.. కుటుంబ సభ్యులు రాత్రి కూడా కృష్ణ సేఫ్‌గా ఇంటికి తిరిగి వచ్చేస్తారని, ట్రీట్‌మెంట్‌ జరుగుతోందని చెప్పుకొచ్చారు. ఈ తెల్లవారుజామున నాలుగు గంటలకు సూపర్‌స్టార్‌ కృష్ణ అందరినీ విడిచిపెట్టి తారాలోకం చేరుకున్నారనే చేదు నిజాన్ని చెప్పారు. కృష్ణ మరణవార్తను అధికారికంగా ప్రకటించడంతో.. ఆఖరిచూపు కోసం అభిమానులు, ఆత్మీయులు కాంటినెంటర్‌ హాస్పిటల్‌కు, పద్మాలయ స్టూడియోకు వస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story