Mahesh Babu: మహేష్ బాబు మరోసారి.. 30 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు..

Mahesh Babu: మహేష్ బాబు మరోసారి.. 30 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు..
X
Mahesh Babu: సామాజిక సేవలో పాలు పంచుకునే మహేష్ హీల్-ఎ-చైల్డ్ పేరుతో స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు.

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. 30 మంది చిన్నారులకు గుండె చికిత్సలు చేయించారు. సామాజిక సేవలో పాలు పంచుకునే మహేష్ హీల్-ఎ-చైల్డ్ పేరుతో స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నారు.

ఈ సంస్థ ద్వారా. గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి ఆర్థిక సాయం చేసి ఎంతో మంది చిన్నారుల ప్రాణాలను మహేష్ కాపాడుతుంటారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా, 30 మంది చిన్నారులకు గుండె శస్త్రచికిత్సలు జరిగాయి. ఈ విషయాన్ని మహేష్ బాబు భార్య నమ్రత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమాన్నివిజయవంతం చేసిన డాక్టర్లను ఏపీ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ ఘనంగా సత్కరించారు.

ఇటీవల విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్ మరియు మహేష్ బాబు ఫౌండేషన్‌లోని డాక్టర్ల సహాయంతో 30 మంది పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు చేయించడంతో తన భర్త మహేష్ బాబు 30 మంది చిన్నారుల హృదయాలను రక్షించారని నమ్రత వెల్లడించారు. ఆపరేషన్లు విజయవంతం అయినందుకు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు నమ్రత.

మహేష్ బాబు తనది గోల్డెన్ హార్ట్ అని మరోసారి నిరూపించుకున్నారు. ఈ పనితో అతని గొప్పతనం మరోసారి రుజువైందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పాటలు మిలియన్ల వ్యూస్ ని సంపాదించుకున్నాయి.

Tags

Next Story