సినిమా

సూపర్ స్టార్ రజనీకాంత్ కు తీవ్ర అస్వస్థత

సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైబీపీతో ఇబ్బంది పడుతున్న ఆయన హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ కు  తీవ్ర అస్వస్థత
X

తమిళ తలైవా రజనీకాంత్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేరారు. హైబీపీ వల్లే రజనీ అస్వస్థతకు గురైనట్టు అపోలో వైద్యులు చెప్తున్నారు. 'అన్నాత్తే' సినిమా షూటింగ్ కోసం 10 రోజులుగా హైదరాబాద్‌లో ఉంటున్నారు రజనీకాంత్. ఐతే.. 3 రోజుల క్రితం చిత్ర బృందంలో నలుగురికి కరోనా పాజిటివ్‌గా రావడంతో షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు.

అటు రజనీకి కూడా టెస్ట్ చేసినా రిపోర్ట్ నెగిటివ్ వచ్చింది. కానీ ముందు జాగ్రత్తగా రజనీ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఇవాళ బీపీలో హెచ్చుతగ్గులు కనిపించడంతో ఆయన్ను అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అన్ని వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు బీపీ మినహా మిగతా సమస్యలు ఏమీ లేవని ప్రెస్‌నోట్ విడుదల చేశారు.

అటు, రజనీ ఆస్పత్రిలో చేరారన్న వార్త అభిమానుల్లో ఆందోళన నింపింది. డిసెంబర్‌ 31న రజనీ పొలిటికల్ ఎంట్రీపై పూర్తి ప్రకటన వస్తుందని ఎదురు చూస్తున్న టైమ్‌లో ఆయన ఇలా అస్వస్థతకు గురవడంతో అంతా టెన్షన్‌ పడుతున్నారు. బీపీ తప్ప మరే సమస్యా లేదని వైద్యులు చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. రజనీ పూర్తిగా కోలుకోవాలంటూ అభిమానులు పూజలు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES