Rajinikanth : నాకిప్పుడు 10 శాతం కూడా ప్రశాంతత లేదు.. ఆ సినిమా సంతృప్తినిచ్చింది..

X
By - Divya Reddy |23 July 2022 8:30 PM IST
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసక్తికరమైన విషయాలను చెప్పారు.
Rajinikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ ఆసక్తికరమైన విషయాలను చెప్పారు. తన జీవితంలో ఇప్పటివరకు ఎంతో డబ్బు, పేరు ప్రఖ్యతలు సాధించినప్పటికీ 10 శాతం కూడా ప్రశాంతత లేదన్నారు. బాబా, రాఘవేంద్ర సినిమాలు తనకు చాలా ఇష్టమని.. ఆ సినిమాల ప్రభావంతో కొందరు నా అభిమానులు నిజంగానే హిమాలయాలకు వెళ్లిపోయారన్నారు. జీవితంలో ఆరోగ్యం చాలా ముఖ్యమైందన్నారు. దానిని కాపాడుకోవాలన్నారు.
చెన్నైలో 'హ్యపీ సక్సెస్‌ఫుల్ లైఫ్ త్రూ క్రియ యోగ' అనే పుస్తకాన్ని ఆయన ఆవిశ్కరించారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ తన మనసులోని భావాలను ఇలా పంచుకున్నారు. ప్రస్తుతం రజినీకాంత్.. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో రానున్న జైలర్ సినిమాలో బిజీగా ఉన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com