Chhaava : ఛావా లవర్స్ కు గుడ్ న్యూస్.. త్వరలో తెలుగులోనూ రిలీజ్

Chhaava  :  ఛావా లవర్స్ కు గుడ్ న్యూస్.. త్వరలో తెలుగులోనూ రిలీజ్
X

ఈ నెల 14న విడుదలైన బాలీవుడ్ మూవీ ఛావా అక్కడి బాక్సాఫీస్ రికార్డులను బద్ధలు కొడుతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ కథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్ట్ చేశాడు. రష్మిక మందన్నా శంభాజీ భార్య యషూబాయి పాత్రలో నటించింది. ఔరంగజేమ్ అకృత్యాలను తెలియజేస్తూ.. అతను శివాజీ తర్వాత ఆయన తనయుడైన శంభాజీని బంధించి ఎలా హింసించి చంపాడు అనే కథతో రూపొందిన ఈ మూవీలో అనేక చారిత్రక వక్రీకరణలున్నాయనే విమర్శలున్నా.. బాక్సాఫీస్ వద్ద ఆడియన్స్ అవేం పట్టించుకోవడం లేదు. శంభాజీ రాజ్యం కోసం కాక హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఔరంగజేబ్ తో తలపడ్డాడు అనే పాయింట్ ప్రస్తుతం ఎక్కువగా ఆకట్టుకుంటోంది.

అయితే కేవలం హిందీలోనే విడుదలైన ఈ మూవీని ఇతర భాషల్లో కూడా చూడాలని చాలామంది ప్రేక్షకులు భావించారు. ప్యాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తే బావుండేదని అంతా అనుకున్నారు. ఆ మేరకు తెలుగు ప్రేక్షకులకు గీతా ఆర్ట్స్ బ్యానర్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ వాళ్లు విడుదల చేయబోతున్నారు. అది కూడా మార్చి 7న సినిమా తెలుగు డైలాగ్స్ తో విడుదల కాబోతోంది. మొత్తానికి ఈచిత్రాన్నిరీజినల్ లాంగ్వేజెస్ లో చూడాలనుకున్న వారి కోరిక నెరవేరబోతోంది. ముందుగా ఇది తెలుగు ప్రేక్షకులకు గుడ్ న్యూస్ అని చెప్పాలి. మరి తెలుగులో ఛావాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

Tags

Next Story