Krishna Birthday celebrations : ఘనంగా కృష్ణ పుట్టినరోజు వేడుకలు..!

Krishna Birthday celebrations : ఘనంగా కృష్ణ పుట్టినరోజు వేడుకలు..!
X
Krishna Birthday celebrations : ఇక కుటుంబ సభ్యుల మధ్య ఆ పుట్టినరోజు వేడుకులు కూడా ఘనంగా జరిగాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Krishna Birthday celebrations : టాలీవుడ్ సీనియర్ హీరో కృష్ణ నేడు 80వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.. ఈ సందర్భంగా ఆయనకి సినీ సెలబ్రిటీలతో పాటుగా అభిమానులు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేశారు. ఇక కుటుంబ సభ్యుల మధ్య ఆ పుట్టినరోజు వేడుకులు కూడా ఘనంగా జరిగాయి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అటు కృష్ణకి ఆయన తనయిడు సూపర్ స్టార్ మహేష్ బాబు శుభాకాంక్షలు తెలియజేశాడు. 'పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా..! మీలాంటి వారు నిజంగా ఎవరూ లేరు. రాబోయే చాలా రోజుల్లో మీరు మరింత సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. లవ్ యూ..' అని ట్వీట్ చేశారు.

కృష్ణ కోడలు, మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్ ఇన్‌స్టాగ్రామ్‌లో మామయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 'మీతో గత కొన్నేళ్లుగా మాకు చాలా ఇష్టమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మీరు నా జీవితంలో చాలా ప్రేమ, నవ్వు, దయ, ఆనందాన్ని తెచ్చారు. నేను ఎప్పటికీ కృతజ్ఞురాలిని. మీరు నా భర్తకు, నాకు మా అందరికీ తండ్రి అయినందుకు ధన్యవాదాలు. పుట్టినరోజు శుభాకాంక్షలు మామయ్యా.. మేము నిన్ను ప్రేమిస్తున్నాం' అని పోస్ట్ చేసింది.

Tags

Next Story