Rajinikanth : రజినీకాంత్ నెక్ట్స్ సినిమా ఫిక్స్..!

Rajinikanth : గతేడాది దీపావళికి విడుదలైన సూపర్ స్టార్ రజినీకాంత్ పెద్దన్న తెలుగులో అనుకున్నంత స్థాయిలో ఆడలేదు.. అటు తమిళ్ లో కూడా ఈ సినిమాకి ఆదరణ దక్కలేదు.. . శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఈ సినిమాలో కీర్తి సురేష్ కీలకపాత్ర పోషించింది. అయితే ఈ సినిమా తర్వాత రజినీ ఇంతవరకు తన కొత్త సినిమాని అఫీషియల్ గా అనౌన్సు చేయలేదు. అనారోగ్యం కారణంగా రజినీ సినిమాలు చేయడం లేదని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. ఇదిలావుండగా ఓ యంగ్ డైరెక్టర్ తో రజినీ కొత్త సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది. విజయ్ హీరోగా ప్రస్తుతం బీస్ట్ సినిమాతో బిజీగా ఉన్న నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీ తర్వాత సినిమా ఉండబోతోందట. దీనికి సంబంధించిన ప్రకటన త్వరలోనే రానుందట. అనిరుద్ సంగీతం అందిచబోతున్నాడట. సమ్మర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com