Jani Master : జానీ మాస్టర్ కు కో-కొరియోగ్రాఫర్ల మద్దతు

Jani Master : జానీ మాస్టర్ కు కో-కొరియోగ్రాఫర్ల మద్దతు
X

లైంగిక వేధింపుల ఆరోపణలతో అరెస్ట్‌ అయిన జానీ మాస్టర్‌కు పలువురు మద్దతు పలుకుతున్నారు. ఆట ఫేమ్ జ్యోతి రాజ్ అనే కొరియోగ్రాఫర్.. ఇది కుట్ర అని అన్నారు. సొసైటీలో ఉన్న కట్టుబాట్లు, చట్టాలను ఉపయోగించి పాపులరైన వారిని ఇబ్బందిపెట్టే ప్రయత్నంగా చెప్పారు. కష్టపడి ఉన్నతస్థాయికి ఎదిగిన వారిని కొందరు టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. ఆమె మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది.

జానీమాస్టర్‌ తప్పు చేసి ఉండకపోవచ్చని..డ్యాన్సర్‌ రాము అన్నారు. కావాలనే జానీ మాస్టర్‌ మీద కుట్ర చేస్తున్నారని తెలిపారు. విచారణ తర్వాత నిజానిజాలు వచ్చాక న్యాయం పక్షాన పోరాడుతామన్నారు. కాగా ఇప్పటికే గోవాలో జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్యప్రాంతంలో విచారిస్తున్నారు. పోక్సో కోర్టు న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు పోలీసులు.

Tags

Next Story