సినిమా

surekha konidela : ట్విట్టర్ లోకి మెగాస్టార్ సతీమణి.. పవన్‌‌కి కంగ్రాట్స్..!

surekha konidela : ట్విట్టర్... సోషల్ మీడియా ప్లాట్‌‌​ఫామ్​లలో ఇదొకటి.. ఎక్కువగా సెలబ్రిటీలు వాడుతారనే పేరు కూడా ఉంది.

surekha konidela : ట్విట్టర్ లోకి మెగాస్టార్ సతీమణి.. పవన్‌‌కి కంగ్రాట్స్..!
X

surekha konidela : ట్విట్టర్... సోషల్ మీడియా ప్లాట్‌‌​ఫామ్​లలో ఇదొకటి.. ఎక్కువగా సెలబ్రిటీలు వాడుతారనే పేరు కూడా ఉంది. ఇక సినీ సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ప్లాట్​ఫామ్‌‌లో తమ సినిమాలకి సంబంధించిన అప్డేట్ లను ఎప్పటికప్పుడు అందిస్తుంటారు. మొన్నటివరకు ట్విట్టర్ దూరంగా ఉన్న సెలబ్రిటీల సతీమణులు మెల్లిమెల్లిగా సోషల్ మీడియాలోకి అడుగుపెడుతున్నారు. ఎన్టీఆర్ భార్య లక్ష్మీప్రణతి ఈ మధ్యే ట్విట్టర్ లోకి జాయిన్ అవ్వగా, తాజాగా మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చారు.

కొడుకు రామ్ చరణ్‌‌తో దిగిన ఫొటోను తన ఫస్ట్​ పోస్ట్‌‌ను షేర్​చేశారు సురేఖ... "నా సూపర్​ స్టైలిష్​ కొడుకుతో నా మొదటి పోస్ట్‌‌తో​ ట్విటర్‌‌లో చేరినందుకు సంతోషంగా ఉంది" అంటూ రాసుకొచ్చారు. అలాగే ఇటీవల భీమ్లానాయక్ మూవీతో సూపర్ సక్సెస్ కొట్టిన పవన్ కళ్యాణ్‌‌కి శుభాకాంక్షలు తెలియజేశారు సురేఖ.. కాగా సురేఖని ఇప్పటివరకు 1,900 ఫాలో అవుతుండగా, ఆమె మాత్రం చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లను ఫాలో అవుతున్నారు.


Next Story

RELATED STORIES