Surekha Vani Daughter: టాలీవుడ్‌లోకి సురేఖ వాణి కూతురు.. ఫస్ట్ లుక్ రిలీజ్..

Surekha Vani Daughter: ఇప్పటికే ఎందరో దర్శకులు, నటీనటులు, నిర్మాతల వారసులు సినిమాల్లో అడుగుపెట్టి వారేంటో నిరూపించుకున్నారు. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ వారసురాలిగా వచ్చిన వారు చాలా తక్కువ. టాలీవుడ్‌లో ఎంతోకాలంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, అప్పుడప్పుడు పలు కామెడీ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించింది సురేఖ వాణి. ఇప్పుడు తన కూతురిని కూడా నటిగా ప్రవేశపెట్టడానికి సిద్ధమయ్యింది.
సినిమాలకంటే సురేఖ వాణికి సోషల్ మీడియాలోనే ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. అందుకే తన కూతురు సుప్రిత కూడా ఇన్‌స్టాగ్రామ్ నుండే ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటివరకు సుప్రిత చేసిన రీల్స్‌కు , ఫోటోషూట్స్‌కు సోషల్ మీడియాలో బాగానే లైకులు వచ్చాయి. ఇక పలు షార్ట్ ఫిల్మ్స్‌లో కూడా సుప్రిత నటించి మెప్పించింది. ఇక త్వరలోనే మంచు లక్ష్మి చేస్తున్న చిత్రంలో నటిగా వెండితెరకు పరిచయం కానుంది సుప్రిత.
'లేచింది మహిళా లోకం' అనే టైటిల్‌తో మంచు లక్ష్మి ఇటీవల ఓ కొత్త చిత్రం ప్రారంభించింది. ఇందులో మంచు లక్ష్మితో పాటు శ్రద్ధా దాస్, హేమ లాంటి ఇతర నటీమణులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు సుప్రిత కూడా ఓ ముఖ్య పాత్రలో నటిస్తూ ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఈ సినిమా గురించి సుప్రిత తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోయినా.. మంచు లక్ష్మి పోస్ట్ చేసిన ఫస్ట్ లుక్‌తో ఈ విషయం బయటికొచ్చింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com