Surekha Vani Second Marriage : తాళిబొట్టుతో సురేఖా వాణి.. వైరల్ గా మారిన పిక్..రెండో పెళ్ళంటూ.!

Surekha Vani Second Marriage : తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో సురేఖా వాణి ఒకరు.. అక్క, చెల్లి, తల్లి పాత్రలలో ఆమె ఎక్కువగా కనిపిస్తారు. తెలుగు, తమిళ సినిమాల్లో కలిపి దాదాపుగా 50 సినిమాలలో ఆమె నటిచింది. ఇప్పుడు సినిమాలలో ఎక్కువగా కనిపించకపోయిన సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
అయితే తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఆమె షేర్ చేసిన ఓ పిక్ వైరల్ గా మారింది. ఆ ఫోటోలో బ్లూ కలర్ సారీ ధరించి మెడలో తాళిబొట్టుతో కనిపించింది సురేఖా వాణి.. సాధారణంగా అయితే మహిళలు భర్త చనిపోయిన తరువాత తాళిబొట్టు తీసివేస్తారు. కానీ సురేఖావాణి అలా తాళిబొట్టుతో కనిపించడం పలు అనుమానాలకి దారీ తీసింది. దీనితో ఆమె రెండో పెళ్లి చేసుకుందా అంటూ కొందరు నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మరికొందరు మాత్రం ఆమె నటి కావడంతో ఏదైనా సినిమాకు సంబంధించిన పాత్ర అయ్యుండొచ్చు అని కామెంట్ చేస్తున్నారు. కాగా సురేఖా వాణి భర్త సురేష్ తేజ రెండేళ్ల కిత్రం మరణించిన సంగతి తెలిసిందే.. ఈ దంపతులకి సుప్రిత అనే కూతురు కూడా ఉంది. ఇక ఆ మధ్య సురేఖావాణి రెండో పెళ్లి చేసుకోబోతోందని వార్తలు రాగా వాటిని ఆమె ఖండించారు.
ఆ రెండోవాడు ఎవడో మీరే చెప్పాలి అంటూ ఫైర్ అయ్యారు సురేఖా వాణి. ఈ క్రమంలో ఆమె తాళిబొట్టుతో కనిపించడం మరోసారి రెండో పెళ్లి వ్యవహారాన్ని మరోసారి తెర మీదకు తీసుకొచ్చినట్టు అయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com