Suresh Babu: వ్యాక్సిన్ పేరుతో మోసం.. నిర్మాత సురేష్ బాబుకి లక్ష రూపాయలకు టోకరా..

Suresh Babu: సురేష్ ప్రొడక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ కూడా అయిన టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబును ఓ వ్యక్తి మోసం చేశాడు. కోవిడ్ వ్యాక్సిన్లు అందజేస్తానని చెప్పి అతడి అకౌంట్‌కి లక్ష రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నాడు. ఈ మేరకు సురేష్ బాబు జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎంక్వైరీ చేసి నిందితుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడంతో తాము మోసపోయామని తెలుసుకున్న సురేష్ బాబు మేనేజర్ రాజేంద్ర ప్రసాద్ మే 31 న జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
"నిర్మాత సురేష్ బాబుకు ఒక వ్యక్తి నుండి ఫోన్ వచ్చింది, అతను సినిమా ఇండస్ట్రీలోని సిబ్బందికి టీకాలు వేసేందుకు పెద్ద మొద్దంలో వ్యాక్సిన్ కిట్లు అందజేయగలనని పేర్కొన్నాడు. కానీ ముందస్తుగా రూ. లక్ష అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయమన్నాడు.
సైబరాబాద్ సైబర్ క్రైమ్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ (ఎసిపి) బాలకృష్ణ మాట్లాడుతూ, " ఇలాంటి కాల్స్‌కు ఎవరూ బలైపోకూడదని, రుజువులు లేదా పత్రాలు లేకుండా, తెలియని నంబర్‌లకు డబ్బు పంపించే ముందు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఇలాంటి అనేక సైబర్ నేరాలు, ఉద్యోగాల పేరిట డబ్బు అడగడం, వ్యక్తిగత రుణాలు, బిట్‌కాయిన్ల ద్వారా పెట్టుబడి ఆఫర్లు ఇవ్వడం కూడా విస్తృతంగా జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com