Suriya-Jyotika: గొప్ప మనసు చాటుకున్న సూర్య.. ఎడ్యుకేషన్ ట్రస్టుకు భారీ విరాళం..

Suriya-Jyotika: గొప్ప మనసు చాటుకున్న సూర్య.. ఎడ్యుకేషన్ ట్రస్టుకు భారీ విరాళం..
Suriya-Jyotika: ఇతరులకు సాయం చేయడంలో ముందుండే తమిళ హీరో సూర్య ఈ సారి ఇరులార్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కు రూ. కోటి విరాళం ఇచ్చారు.

Suriya-Jyotika: ఇతరులకు సాయం చేయడంలో ముందుండే తమిళ హీరో సూర్య ఈ సారి ఇరులార్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ కు రూ. కోటి విరాళం ఇచ్చారు. ఈ చెక్కును తమిళ నాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కు అందజేశారు.

సూర్య, జ్యోతిక దంపతులు ఇరుల గిరిజన సంక్షేమానికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు అందజేశారు. రిటైర్డ్ జస్టిస్ కె చంద్రు, పజంకుడి ఇరులార్ ట్రస్ట్ సభ్యులు సూర్య, జ్యోతిక, ఎంకే స్టాలిన్ చెక్కును స్వీకరించారు. జై భీమ్ అంటూ ఇరులార్ తెగకు చెందిన వారిపై కస్టడీ టార్చర్ గురించి సూర్య మాట్లాడాడు.

సూర్య నటించిన జై భీమ్ నవంబర్ 2 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అవుతుంది. జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన జై భీమ్ 1993లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. ఈ చిత్రం కుల వివక్ష మరియు ఇరుల తెగకు జరిగిన అన్యాయాన్ని దర్శకుడు హృద్యంగా తెరకెక్కించారు. తమ ప్రొడక్షన్ హౌస్, 2డి ఎంటర్‌టైన్‌మెంట్ తరపున, సూర్య మరియు జ్యోతిక పజాంకుడి ఇరులర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్‌కు విరాళాన్ని అందించారు.

జై భీమ్ గురించి

జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన జై భీమ్ చిత్రంలో సూర్య, లిజోమోల్ జోస్, మణికందన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రకాష్ రాజ్, రజిషా విజయన్, జయప్రకాష్, రావు రమేష్ ఈ చిత్రంలో మరికొన్ని ముఖ్య పాత్రల్లో నటించారు.

Tags

Read MoreRead Less
Next Story