Suriya : సూర్యను లైట్ తీసుకుంటున్న దర్శకుడు

Suriya :  సూర్యను లైట్ తీసుకుంటున్న దర్శకుడు
X

ఫ్లాపుల్లో ఉన్న హీరోలంటే ఆ డైరెక్టర్ కు అలుసా లేక.. మొహమాటానికి ఒప్పుకున్న సినిమానా అనేది తెలియదు కానీ.. కోలీవుడ్ స్టార్స్ లో ఒకడైన సూర్యను పిచ్చ లైట్ తీసుకుంటున్నాడు వెట్రిమారన్. సూర్య కొన్నాళ్లుగా వరుస ఫ్లాపుల్లో ఉన్నాడు కదా. ఆ మాటకొస్తే అతగాడూ చివరగా చేసిన విడుదలై 2 డిజాస్టర్ అయింది. ఈ ప్రాజెక్ట్ కంటే ముందే అతను సూర్య తో వాడివాసల్ అనే ఓ విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీకి కమిట్ అయి ఉన్నాడు. అతని కోసం ఎదురుచూసిన సూర్య.. విడుదలై 2 కు ఎక్కువ టైమ్ తీసుకుంటూ ఉండటంతో కార్తీక్ సుబ్బరాజ్ తో రెట్రో మూవీకి ఓకే చెప్పాడు.

విడుదలై 2 వచ్చింది పోయింది. కానీ ఇప్పటి వరకూ సూర్యతో చేయబోయే వాడివాసలై స్క్రిప్ట్ ను పూర్తి చేయలేదట వెట్రి మారన్. కానీ అదే టైమ్ లో ధనుష్ తో రీసెంట్ గా అనౌన్స్ అయిన సినిమాకు కథ ప్రిపేర్ చేసుకుంటున్నాడట. అంటే సూర్యను లైట్ తీసుకుంటున్నట్టే కదా అంటున్నారు కోలీవుడ్ జనం. ముందు ఒప్పుకున్న హీరోను కాదని తర్వాతెప్పుడో ఓకే చేసిన హీరో కోసం కథ సిద్ధం చేయడం అంటే సూర్యను ఇన్సల్ట్ చేసినట్టే కదా.

మరోవైపు సూర్య చిత్రానికి విపరీతమైన విఎఫ్ఎక్స్ ఉంటాయట. అంటే జల్లికట్టు నేపథ్యంలోని కథట. అందుకే గ్రాఫిక్స్ అవసరం అవుతాయి. కొన్ని రోజుల క్రితం ఆ గ్రాఫిక్స్ కోసం జురాసిక్ పార్క్ చిత్రాలకు పనిచేసిన టీమ్ తో లండన్ లో వర్క్ చేయిస్తున్నాను అన్నాడు నిర్మాత కలైపులి ఎస్ థాను. బట్ వెట్రిమారన్ కు ఇప్పుడు సూర్యతో మూవీ చేసే మూడ్ లేదేమో కానీ.. ఆ కథను, ప్రాజెక్ట్ ను పట్టించుకోవడం లేదట. ఈ విషయం నిర్మాతను అడిగితే అదేం లేదంటున్నాడు. అదే టైమ్ లో సూర్య కూడా తన పనేదో తను చేసుకుంటున్నాడు. వెట్రి పూర్తి కథతో వస్తే అప్పుడు చూద్దాం అనుకుంటున్నాడట. చూస్తుంటే ఈ కాంబినేషన్ లో ప్రాజెక్ట్ ప్రస్తుతానికి హోల్డ్ లో పడినట్టే అంటున్నారు.. కోలీవుడ్ పీపుల్.

Tags

Next Story