Suriya : 'కర్ణ'తో సూర్య బాలీవుడ్ ఎంట్రీ
తమిళ స్టార్ సూర్య బాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దమయ్యింది. తుఫాన్ మూవీతో డిజాస్టర్ అందుకున్న సీనియర్ డైరెక్టర్ ఓం ప్రకాష్ మెహ్రాతో సూర్య వర్క్ చేయనున్నట్లు టాక్. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘కర్ణ’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించనుందట. తాజాగా ఈ విషయంపై దర్శకుడు ఓం ప్రకాష్ క్లారిటీ ఇచ్చారు. ఐఫా వేదికగా మాట్లాడుతూ "హీరో సూర్యతో ఓ సినిమా చేస్తున్నానంటూ వస్తున్న వార్తలు నిజమే. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన వర్క్ జరుగుతుంది. త్వరలోనే అధికారికంగా తెలియజేస్తాను" అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో సూర్య అభిమానులు ఫుల్ హ్యాపీ అవుతున్నారు. ఇక సూర్య నటించిన కంగువా త్వరలోనే విడుదల కానుంది
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com