Suriya : 70 కోట్లతో ఖరీదైన బంగ్లా కొన్న సూర్య.. ఎక్కడంటే

Suriya : 70 కోట్లతో ఖరీదైన బంగ్లా కొన్న సూర్య.. ఎక్కడంటే
X

స్టార్ హీరో సూర్య ముంబైకి షిఫ్ట్ అవుతున్నాడా అని కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి గుర్తుందా..? దీంతో పాటు అతను భార్య జ్యోతికతో విడిపోతున్నాడు.. అందుకే జ్యోతిక ముంబైలో సినిమాలు చేస్తూ అక్కడే ఉంటోంది రూమర్స్ కూడా వచ్చాయి. యస్.. కావడానికి రూమర్స్ కావొచ్చు. కానీ వీళ్లు ముంబైలో మకాం పెట్టాలనుకున్నది నిజమే అని తేలిపోయింది. ప్రస్తుతం ప్యాన్ ఇండియా రేంజ్ లో తన మార్కెట్ ను విస్తరించుకునే పనిలో ఉన్నాడు సూర్య. అందుకు ఫస్ట్ ఎటెంప్ట్ గా విక్రమ్ లో చేసిన గెస్ట్ రోల్ బాగా సెట్ అయింది. త్వరలోనే కంగువా మూవీతో రాబోతున్నాడు. ఇది అతని కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో వస్తోన్న మూవీ. ప్యాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయబోతున్నారు. ఈ మూవీలో అనేక సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని.. అందుకే వాల్డ్ వైడ్ ఆడియన్స్ ను కూడా మెస్మరైజ్ చేస్తుందనే టాక్ ఉంది. కంగువా తర్వాత సూర్య రేంజ్ మారబోతోందనే అంచనాలున్నాయి.

ఆ రేంజ్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకువెళ్లాలంటే ఇండియన్ ఫిల్మ్ కాపిటల్ ముంబైలో మకాం లేకపోతే ఎలా. అందుకే అక్కడ 70 కోట్లతో ఒక విలాసవంతమైన అపార్ట్ మెంట్ కొన్నారట. అయితే ఇది కేవలం సూర్య కోసం మాత్రమే కాదు.. వీరి పిల్లలు ప్రస్తుతం ముంబైలోనే చదువుతున్నారు. వారి కోసమే ముంబైకి వెళ్లన జ్యోతిక అక్కడ నటిగానూ బిజీ అవుతోంది. దీంతో అక్కడ సొంత ఇల్లు ఉంటే బెటర్ అనే ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. అయితే సూర్య మైండ్ సెట్ కు ముంబై పీపుల్ తో మింగిల్ అవుతాడా అనే డౌట్స్ వెలిబుచ్చుతున్నారు ఫ్యాన్స్. అదీ నిజమే. అక్కడంతా పాష్ లైఫ్ కదా.

Tags

Next Story